నెలరోజులు ఇది రోజూ హాఫ్ స్పూన్ చాలు.. మీ ఆరోగ్యం ఎలా మారుతుందంటే!
మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పసుపు చాలా ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే ఆహారం. అయితే అటువంటి పసుపును ఒక నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం మనం చూడొచ్చు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
పసుపుతో ఇమ్యూనిటీ
పసుపు చాలా మంచి ఆహారం. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడుకున్న క్రియాశీల సమ్మేళనం. అటువంటి పసుపును ఒక నెలరోజుల పాటు ప్రతిరోజు తీసుకుంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ప్రతిరోజు తమ రోజువారి ఆహారంలో పసుపును చేర్చుకున్న వారు 30 రోజుల తర్వాత బలమైన వ్యాధినిరోధకశక్తితో కనిపించారు అని ఒక అధ్యయనం తేల్చింది.

పసుపు నెలరోజులు తీసుకుంటే ఈ బెనిఫిట్స్
మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహజ సప్లిమెంట్ గా పసుపు పనిచేస్తుంది. పసుపును ఒక నెలరోజుల పాటు ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది ప్రతిరోజు ఉదయం వేడి నీళ్లలో అర స్పూన్ వేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీవక్రియ కూడా పెరుగుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ మన కడుపులో మంట వంటి లక్షణాలను తగ్గించి జీర్ణశక్తికి దోహదం చేస్తుంది.
ఈ సమస్యలకు పసుపు బెస్ట్
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఉదయం పసుపును తీసుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది. పసుపు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కావడంతో దీనిని తీసుకోవడం వల్ల శరీర ఆక్సికరణ ఒత్తిడి నుండి కాపాడబడుతుంది. ఇక రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో పసుపు కీలక భూమిక పోషిస్తుంది.అంతేకాదు పసుపు మన చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
పసుపు విషయంలో ఇలా చెయ్యొద్దు.. జాగ్రత్త
పసుపును ఎక్కువగా తీసుకుంటే ప్రతికూల ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి పరిమిత మోతాదులో పసుపును తీసుకుంటే మంచిది. పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారు, కాలేయ సమస్యలు ఉన్నవారు పసుపును తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పసుపుని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలనుకుంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించి, వైద్యుల సలహాలు, సూచనల మేరకు తీసుకుంటే మంచిది.












Click it and Unblock the Notifications