సూపర్ టేస్టీ "మట్టగిడసల పులుసు".. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు..!

చేపలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చేపల పులుసు అంటే వావ్ అంటూ లొట్టలేసుకుంటూ తింటారు. చేపలతో ఎన్నో రకాలుగా వంటలు తయారు చేసుకుంటారు. చేపలను ఫ్రై చేసుకుంటారు. ఇంకొంతమంది పులుసు పెట్టుకుంటారు. మరి చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అవి చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఈసారి సూపర్ టేస్టీ మట్టగిడసల పులుసు ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ తెలుసుకుందాం.

సూపర్ టేస్టీ మట్టగిడసల పులుసు తయారీ విధానం చూస్తే.. ముందుగా కావాల్సిన పదార్థాలు చూస్తే శుభ్రం చేసిన మట్టగిడసలు అరకేజీ, చింతపండు రసం అర కప్పు నానబెట్టి తీసింది. పెద్ద ఉల్లిపాయలు రెండు లేదా మూడు, పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు, కారం మూడు టేబుల్ స్పూన్ లు, పసుపు అర టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా మెంతులు, జీలకర్ర పొడి అర టీస్పూన్ తీసుకోవాలి.

మట్టగిడసల పులుసు తయారీకి ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కలను పక్కన పెట్టుకోండి. ఒక వెడల్పాటి పాత్రలో నూనె వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా చేయించండి. ఇప్పుడు కారం, పసుపు అలాగే అందులోనే ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలోనే చింతపండు రసం, తగినన్ని నీళ్లు, చేప ముక్కలను నిదానంగా వేయాలి.

MattagidasalaPulusu Recipe Prepare This Way for Super Tasty Results Bowl Will Be Wiped Clean

అందులోనే మెంతులు, జీలకర్ర పొడి వేయాలి. మూత పెట్టి చిన్న మంటపై 15 నుంచి 20 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అలా చేప ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి. పులుసు చిక్కబడే వరకు ఉంచుకోవాలి. అప్పుడు చేపల కర్రీని ఎక్కువగా కదపకండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.. అంతే సూపర్ టేస్టీ మట్టగిడసల పులుసు తయారు చేసుకోవడమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+