మార్నింగ్ వాకింగ్ Vs ఈవినింగ్ వాక్ - ఎవరికి ఏది మంచిది..!?

ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అవసరం. ఇందు కోసం చాలామంది వాకింగ్ ను ఎంచు కుంటారు. కొందరు ఉదయం సమయంలో... మరి కొందరు సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తూ ఉంటారు. చాలా మందికి మార్నింగ్ వాకింగ్ లేదా సాయంత్రపు నడక బెటరా? ఎప్పుడు వాకింగ్ చేస్తే మంచిది అనే ప్రశ్న వస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే రెండింట్లో ఏది చేస్తే మెరుగైన ఫలితాలు కలుగుతాయో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. ఉదయం.. సాయంత్రం ఏ సమయంలో చేసినా ఆరోగ్య పరంగా మాత్రం ప్రయోజనాలు ఖాయమని చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వీలైన సమయంలో వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అవసరం. చాలా మంది వాకింగ్ ద్వారా తమ దినచర్య ప్రారంభిస్తారు. గుండె ఆరోగ్యానికి వాకింగ్‌ అనేది ఎంతో మేలు చేస్తుంది. వాకింగ్‌ బీపీ, షుగర్‌, అధిక బరువును కూడా కంట్రోల్‌ చేస్తుంది. మార్నింగ్ వాకింగ్ చేసే వారికి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణ పెంచటంతో పాటుగా రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది. గుండె కండరాలకు బలం అందిస్తుంది. బరువు తగ్గేందుకు.. రోజు మొత్తం యాక్టివ్ గా ఉండాలనుకునే వారు మార్నింగ్ వాక్ బెస్ట్ అని సజెస్ట్ చేస్తున్నారు. దీని ద్వారా కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటుగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా మార్నింగ్ వాక్ ద్వారా విటమిన్ డీ సహజసిద్ధంగా అందుతుంది. మార్నింగ్ వాకింగ్ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మార్నింగ్ వాకింగ్ వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి.. హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

morning-walks-better-for-fat-burning-and-energy-evening-walks-support-relaxation

ఇక, చాలా మంది సాయంత్రం వాకింగ్ చేసే వారూ ఉన్నారు. ఈవినింగ్ వాక్ ద్వారా రోజంతా ఏర్పడిన మానసిక ఒత్తిడిని తగ్గించుంకోవచ్చు. అదే విధంగా హాయిగా నిద్రపోవాలనుకునే వారికి వినింగ్ వాకింగ్ బెటర్ అని చెబుతున్నారు. సాయంత్రం వరకు కండరాల బలం, పనితీరు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అందువల్ల ఈవినింగ్ వాకింగ్ బాడీ ఫిట్‌నెస్‌కు ఉపయోగ కరంగా ఉంటుంది. అదే విధంగా రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడిచితే జీర్ణక్రియ మెరుగవుతుందని.. షుగరు లెవన్స్ పెరగకుండా ఉంటాయని సూచిస్తున్నారు. తిన్న తరువాత కొద్ది సేపు నడవటంతో ఆహారాన్ని సులభంగా జీర్ణించేందుకు, జీవక్రియను సక్రమంగా నిర్వహించేలా సహాయ పడుతుందిని వివరిస్తున్నారు. ఆహారాన్ని సులభంగా జీర్ణించేందుకు, జీవక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. దీంతో.. మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏ సమయంలో చేసినా .. వారి శారీరక పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవటం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+