ఇంతమంది అబార్షన్లు చేయించుకుంటున్నారా..?
భారతదేశంలో గర్భస్రావాలు ఒక సంక్లిష్ట సామాజిక, ఆరోగ్య సమస్య. చట్టబద్ధంగా అనుమతించబడినప్పటికీ, అనేక కారణాల వల్ల మహిళలు గర్భస్రావాలకు పాల్పడుతున్నారు. దాదాపు ఏడాదికి కోటి మందికి పైగానే గర్భస్రావాలు చేయించుకుంటారని తెలుస్తోంది.వీటిలో ఆర్థిక ఇబ్బందులు, అవాంఛిత గర్భం, ఆరోగ్య సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు మొదలైనవి ఉన్నాయి.53 శాతం మంది అమ్మాయిలు ప్రైవేట్ హెల్త్ సెక్టార్‌లో అబార్షన్లు చేయించుకున్నాం అని చెప్పగా.. 20 శాతం మంది పబ్లిక్ సెక్టార్లో చేయించుకున్నట్లు వెల్లడించారు.
ఇక 27 శాతం మంది మహిళలు తాము ఇళ్లలోనే గర్భస్రావం చేసుకున్నామని తెలిపారు.భారతదేశంలో గర్భస్రావాల సంఖ్యకు అధికంగానే జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. చాలా గర్భస్రావాలు నమోదు చేయబడటం లేదు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరియు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయి.శృంగారం సమయంలో సెఫ్టీ పద్ధతులు పాటించకపోవడం, సెక్స్‌పై సరైన అవగాహన లేకపోవడంతో అవాంఛీత గర్భాలు వస్తున్నాయి.

కారణాలు:
అవాంఛిత గర్భం అత్యంత సాధారణ కారణం.గర్భిణి లేదా గర్భంలోని శిశువుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా గర్భస్రావానికి దారితీస్తాయి.వివాహం కాని గర్భం, వయస్సు, లింగం వంటి సామాజిక ఒత్తిళ్లు కూడా గర్భస్రావాలకు కారణమవుతాయి.పేదరికం మరియు ఆర్థిక ఇబ్బందులు కూడా గర్భస్రావాలకు దోహదపడతాయి.
సమస్యలు:
చాలా మంది మహిళలు అనధికారిక క్లినిక్‌లలో గర్భస్రావాలు చేయించుకుంటారు, ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.గర్భస్రావం గురించి సమాజంలో ఇంకా చాలా తప్పుడు భావనలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గర్భస్రావంపై కఠినమైన చట్టాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications