తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..!
ఎండాకాలం ఇంకా పూర్తిగా స్టార్ట్ కాకుండానే ఎండలు మండిపోతున్నాయి. అయితే మండు వేసవిలో ఫ్రై, డీప్ ఫ్రై కర్రీలను తినేందుకు చాలామంది ఇష్టపడరు. పప్పు, చారు, లాంటి తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలను తినేందుకే సుముఖత వ్యక్తం చేస్తుంటారు. అయితే కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయ్యే సమ్మర్ స్పెషల్ 'పచ్చి పులుసు' ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
'పచ్చి పులుసు' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. చింతపండు, పచ్చి మిర్చి 4 లేదా 5, పసుపు హాఫ్ టీ స్పూన్, జీలకర్ర కొద్దిగా, ఆవాలు, ఉల్లిపాయలు రెండు లేదా మూడు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, కొత్తిమీర తురుము తీసుకోవాలి.
ఇక 'పచ్చి పులుసు' తయారీ విధానం చూస్తే.. ముందుగా చింతపండును నీటిలో నానబెట్టుకోవాలి. ఆ రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోటిలో లేదా మిక్సీ జారులో వెల్లుల్లి, జీలకర్ర కచ్చాపచ్చాగా మిక్సింగ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. నూనె వేయాలి. అందులో ఆవాలు, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి.

ఆ తర్వాత జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ మిశ్రమంలోనే ధనియాల పొడి, కొత్తిమీర తరుగు వేయాలి. ఇప్పుడు అందులో రెడీ చేసుకున్న చింతపండు రసం వేసి కలుపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ పచ్చి పులుసు రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications