మీకు "పానీ పూరీ" ఇష్టమా.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..?

పానీపూరీ... ఈ పేరు వినగానే చాలామందికి నోరూరడం ఖాయం. గప్​చుప్, గోల్​గప్ప వంటి ఏ పేరుతో పిలిచినా.. దీనిని ఇష్టపడే వారు సైతం లక్షల్లో, కోట్లలో ఉంటారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు. స్ట్రీట్ ఫుడ్ లాగా ప్రసిద్ధి చెందిన పానీపూరీని చాలామంది రోజువారీగా తింటుంటారు. కానీ వీధి వ్యాపారులు పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ప్రమాదకరమైన రోగాలు వ్యాపించే అవకాశాలున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

స్ట్రీట్ ఫుడ్స్ లో పానీ పూరీ వెరీ వెరీ స్పెషల్. సాయంత్రం అయితే చాలు పానీ పూరీని తినేందుకు పిల్లల నుంచి పెద్దల వరకూ పానీ పూరీ బండి దగ్గరకు చేరుకుంటారు. అయితే బయట పానీపూరీ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుచితో పాటు ఆరోగ్యాన్ని కోరుకునే వారు పానీపూరీని ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా పులుపు, కారం కలిసిన రుచిని అస్వాదించవచ్చు. ఇంట్లోనే పానీ పూరీ ఎలా చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా...

pani-puri-making-recipe-in-telugu-with-easy-steps

పానీపూరీ తయారీకి అవసరమైన పదార్థాలు :

పూరీ కోసం:

బొంబాయి రవ్వ - 250 గ్రాములు

మైదా - 50 గ్రాములు (పావు కప్పు)

ఉప్పు - కొద్దిగా

నీళ్లు - తగినంత

మసాలా కోసం:

తెల్ల ఎండు బఠాణి - 2 కప్పులు (రాత్రంతా నానబెట్టాలి)

నూనె - 50 ml

జీలకర్ర - 1 టీ స్పూన్

బిర్యానీ ఆకులు - 2

ఎండు మిర్చి - 3

సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

పండిన టమాటలు - 2

ఉప్పు - రుచికి సరిపడా

వేయించిన జీలకర్ర పొడి - 1 టీ స్పూన్

పసుపు - చిటికెడు

ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్

కారం - 1 టీ స్పూన్

చాట్ మసాలా - 1 టీ స్పూన్

పానీ కోసం:

పుదీనా తరుగు - 1 కట్ట

కొత్తిమీర తరుగు - 1 కట్ట

నిమ్మకాయ రసం - 1 టేబుల్ స్పూన్

ఉప్పు - కొద్దిగా

పచ్చిమిర్చి - 4

చింతపండు రసం - తగినంత

బ్లాక్ సాల్ట్ - 1 టీ స్పూన్

కారం - 1 టీ స్పూన్

ధనియాల పొడి - 1 టీ స్పూన్

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, మైదా, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిపై తడిగుడ్డ కప్పి సుమారు 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని పెద్ద ఉండలుగా చేసి, పూరీల్లా పలుచగా ఒత్తుకోవాలి. రౌండ్‌ కట్టర్ లేదా చిన్న గిన్నె సహాయంతో పానీపూరీ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని పూరీలుగా తయారుచేసి, వేయించేంతవరకు తడిగుడ్డ కప్పి ఉంచాలి.

ఇప్పుడు స్టవ్ మీద అడుగు లోతుగా ఉండే కడాయి పెట్టి, నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న పూరీలను అందులో వేసి, రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా, క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలా అన్ని పూరీలను వేయించి పక్కన పెట్టుకోవాలి.

మసాలా తయారీ:

ప్రెషర్ కుక్కర్‌లో రాత్రంతా నానబెట్టిన తెల్ల ఎండు బఠాణి, ఒక లీటర్ నీరు పోసి మూత పెట్టి, మీడియం మంటపై ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది మసాలాకు ప్రధాన ఆధారం.

ఇప్పుడు మరో కడాయిలో నూనె వేసి, జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఎండు మిర్చి వేసి వేయించాలి. అవి వేగాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి.

తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా గుజ్జులా మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కారం, చాట్ మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన బఠాణీలను నీళ్లతో సహా వేసి, మరో అర లీటర్ నీళ్లు పోసి 20 నిమిషాలు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.

పానీ తయారీ:

ఒక మిక్సీ జార్‌లో పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జల్లెడలో వేసి, ఒక లీటర్ నీళ్లు పోసి వడకట్టాలి. ఇలా చేయడం వల్ల పానీ మృదువుగా ఉంటుంది.

వడకట్టిన పానీలో చింతపండు రసం, బ్లాక్ సాల్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. రుచి చూసి, అవసరమైతే ఉప్పు, కారం సర్దుబాటు చేసుకోవాలి. అంతే, నోరూరించే పానీ సిద్ధం.

ఇప్పుడు తయారుచేసుకున్న క్రిస్పీ పూరీ, రుచికరమైన మసాలా, పుల్లపుల్లని పానీని కలిపి తింటే, ఇంట్లో చేసిన పానీపూరీ రుచికి బయటిది తినాలనిపించదు. ఈ పానీపూరీ రెసిపీని ప్రయత్నించి, రుచిని, ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+