బొప్పాయి గింజల్లో అదిరిపోయే విటమిన్లు
ఈ భూమి మీద తిన్న తర్వాత ఎటువంటి దుష్ప్రభావం చూపనిది ఏదైనా ఉందా? అంటే అది కేవలం పండు మాత్రమే. అందుకే వీటిని నిత్యం తీసుకుంటుండాలని వైద్యులు సూచిస్తుంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవాటిలో బొప్పాయి ఒకటి. ఇందులో విటమిన్లతోపాటు పోషక విలువలు దండిగా ఉంటాయి. అయితే ఈ పండును తిన్నప్పుడు గింజలను పడేస్తుంటాం. కానీ వాటివల్ల ఉపయోగాలు తెలిస్తే ఎప్పుడూ ఆ గింజల్ని పారవేయం. బొప్పాయి గింజలవల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఎండబెట్టి పొడి చేయాలి : గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఇలా పొడి చేసినదాన్ని ఆహారంపై చల్లుకొని తినొచ్చు. సలాడ్లు, స్మూతీస్ లాంటి వంటకాలపై చల్లుకోవచ్చు. ఈ గింజలు మిరియాల రుచిని పోలివుంటాయి. మసాలా దినుసుల్లా కూడా వాడుకోవచ్చు. వీటిల్లో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణంలాంటి సమస్యలను నివారిస్తుంది.

పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు : యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి తోడ్పడతాయి. అర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో విటమిన్ సి ఉంటుంది. వ్యాధి నిరోధకతను పెంచి రోగాల బారిన పడకుండా చూస్తాయి. అలాగే వీటిల్లో ఉండే ఫైబర్త్ బరువును తగ్గిస్తుంది. బొప్పాయి గింజలు యాంటీ పారాసిటిక్ లక్షణాలను కలిగివుంటాయి. పరాన్న జీవులను తొలగించడంలో సాయపడతాయి. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నియంత్రిస్తాయి.












Click it and Unblock the Notifications