రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. త్వరలో మీ ఖాతాలలో ఆ డబ్బులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా పంటల బీమా పథకాన్ని కూడా అందిస్తోంది. అయితే తాజాగా ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2024 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించిన మంత్రి అచ్చెన్నాయుడు

ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో జరిగిన చర్చల ఫలితంగా ఈ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది .ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.ఢిల్లీలో ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బీమా బకాయిల విషయాన్ని చర్చించారు.

Centre goodnews to farmers green signal for release of pending 2024 Kharif crop insurance dues

2024 ఖరీఫ్ పంటల బీమా బకాయిలు విడుదలకు కేంద్రాన్ని ఒప్పించిన అచ్చెన్న

గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన 2024 ఖరీఫ్ పంటల బీమా బకాయిలు విడుదల చేసేందుకు ఎట్టకేలకు కేంద్రాన్ని ఒప్పించి, విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా, సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్టు గా మంత్రి పేర్కొన్నారు.

పంట నష్టం జరిగితే బీమా సాయమే రైతన్నకు కాస్త ధీమా

బీమా బకాయిల విడుదలకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పంటల బీమా పథకం రైతులు వేసిన పంటకు సంబంధించిన ఆర్థిక భద్రతను కల్పించే కీలక పథకం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, పంట నష్టం జరిగినప్పుడు బీమా సాయం అందితే రైతులు కొంత ఉపశమనం పొందుతారు. లేదంటే రైతుల జీవితం ఆర్థికంగా అల్లకల్లోలంగా మారుతుంది.

వేలాది మంది రైతులకు ప్రభుత్వ సాయం వల్ల కొంత ఉపశమనం

అయితే గతంలో గత ప్రభుత్వ హయాంలో విడుదల కావలసిన పంట బీమా ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మంత్రి చొరవతో కేంద్రం ఆమోదంతో ఈ డబ్బులు త్వరలోనే బకాయిలు విడుదల అవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల చాలామంది రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. వేలాది మంది రైతులు ప్రభుత్వ సాయం వల్ల కొంత ఉపశమనం పొందుతారు. అయితే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే రైతుల ఖాతాల్లోకి నేరుగా పంటల బీమా బకాయిలు వచ్చి పడతాయని మంత్రి చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+