పేపర్ కప్పులో టీ, కాఫీ తాగుతున్నారా? అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
రోజువారీ జీవనం వేగంగా మారిపోతోంది. ఈ వేగంలో కాఫీ, టీ తాగే అలవాటు కూడా మారుతోంది. చాలా మంది పేపర్ గ్లాసులు వాడటం అలవాటు చేసుకున్నారు. ప్రయాణాలు.. బయట ఉన్న సమయంలో చాలా మంది ఈ పేపర్ కప్స్ లో టీ- కాఫీ తాగుతూ కనిపిస్తారు. అయితే.. ఈ కప్స్ లో తాగటం ఆరోగ్యానికి డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి కాఫీ, టీతో ఈ ప్లాస్టిక్ పొరలోని రసాయనాలు కలిసిపోతే, అవి జీర్ణవ్యవస్థకు హాని చేస్తాయి. హార్మోన్లలో మార్పులు, కీళ్ల నొప్పులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ మధ్య కాలంలో బయట టీ స్టాళ్లు.. ప్రయాణాల్లో ఎక్కువగా పేపర్ కప్స్ లోనే టీ, కాఫీ తాగుతూ కనిపిస్తున్నారు. ఇలా పేపర్ కప్స్ లో తాగటం వలన ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగితం కప్పులలో చాలా సన్నని ప్లాస్టిక్ పొర ఉంటుంది. దీన్నే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అదే విధంగా చాలా మంది కర్రీ పాయింట్స్ నుంచి పార్సిల్ సైతం ప్లాస్టిక్ కవర్స్ లోనే తీసుకెళ్తారు. వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లి తినడం వల్ల శరీరానికి హాని చేసే కారకాలు మన శరీరంలో చేరుతున్నాయి. ఇవి రక్తంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి రక్తప్రసరణకు ఆటంకంగా మారుతాయి. ఇలా... అన్నీ ప్లాస్టిక్ ప్యాకెట్లు.. పేపర్ కప్స్ లో ఉంచి శరీరంలోకి తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. వెంటనే ఈ ఫలితాలు కనిపించకపోయినా.. దీర్ఘకాలంలో మాత్రం సమస్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

నిపుణుల హెచ్చరికలు
ప్లాస్టిక్ వినియోగం తగ్గించకపోతే చాలా ప్రమాదమని వైద్యలు, పర్యావరణ వేత్తలు హెచ్చరిక చేస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా ఏటా 10 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వేడి కాఫీ, టీతో ఈ ప్లాస్టిక్ పొరలోని రసాయనాలు కలిసిపోతే, అవి జీర్ణవ్యవస్థకు హాని చేస్తాయి. కీళ్ల నొప్పులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. గాజు, స్టీల్ లేదా సిరామిక్ కప్పులు వాడటం ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది. కాఫీ షాపుకెళ్తే మీ రీయూజబుల్ కప్పు వెంట తీసుకెళ్లడం అలవాటు చేసుకుంటే, మీ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, భూమికి మేలు జరుగుతుంది. దీంతో.. పేపర్ కప్స్.. పేపర్ ప్లేట్స్ లో టీ కాఫీలు- ఆహారం తీసుకోవటం ఎంత త్వరగా మానుకుంటే ఆరోగ్య పరంగా అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications