నిద్ర పట్టక సతమతమౌతుంటే- వేరుశెనగలతో చేసిన ఈ బటర్ ట్రై చేయండి బాస్
కాలానికి అనుగుణంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి, సెల్ ఫోన్ వాడకం.. చాలామందికి నిద్రను దూరం చేస్తోంది. ఈ మధ్యకాలంలో నిద్రలేమి లేదా రాత్రిపూట తరచుగా మేల్కొనే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. దీనికి నిద్రమాత్రలు ప్రధాన పరిష్కారంగా మారాయి. దీర్ఘకాలంలో ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రమాత్రలను ఆశ్రయించడానికి బదులుగా అందుబాటులో ఉండే ఆహార పదార్థాలతో నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు
నిద్ర పట్టకపోతే ఏం చేయాలి? వేధిస్తుంటుంది. నిద్ర సమస్యలు ఉన్నవారు పీనట్ బటర్ తినవచ్చని నిపుణులు సూచించారు. పీనట్ బటర్‌లోని కొన్ని పోషకాలు మనస్సును ప్రశాంతంగా ఉంచి, మంచి నిద్రకు సహాయపడతాయి. పీనట్ బటర్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి దోహదపడతాయి. పీనట్ బటర్ కార్బోహైడ్రేట్ పోషకాలు రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తాయి. చక్కెర స్థాయి హెచ్చుతగ్గులను అరికడతాయి. తద్వారా గాఢనిద్రను కలిగించడంలో సహకరిస్తాయి.

ఇందులో మెగ్నీషియంను కూడా ఉంటుంది. ఈ ఖనిజం- నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. కండరాలను సడలించి, సుఖ నిద్రను కలిగిస్తుంది. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు ఒక చెంచా పీనట్ బటర్ తీసుకోవాలి. ఇది శరీరం దానిని జీర్ణం చేసుకోవడానికి తగిన సమయం ఇస్తుంది. నిద్రపై సానుకూల ప్రభావం చూపుతుంది. పీనట్ బటర్‌లో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరం సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది. సెరోటోనిన్ మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రావస్థను కలిగిస్తుంది.
పీనట్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్లు. రెండు టేబుల్‌స్పూన్ల పీనట్ బటర్ సుమారు ఏడు గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. భోజనంలో 20-30 గ్రాములు తీసుకోవచ్చు. ఇందులో కరిగే, కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణ, జీర్ణక్రియకు సహాయపడతాయి. కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కరగని ఫైబర్, మెగ్నీషియంతో ప్రేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. స్నాక్స్, భోజనంలో ప్రోటీన్‌ను చేర్చడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
కార్బోహైడ్రేట్‌లతో పాటు ప్రోటీన్‌ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగకుండా నిరోధించవచ్చు. పీనట్ బటర్‌లో కొలెస్ట్రాల్ ఉండదు. సంతృప్త, అసంతృప్త కొవ్వుల నిష్పత్తి గుండెకు మంచిది. ఇది బ్లడ్ కొలెస్ట్రాల్‌ను మెరుగుపర్చి, మంటను తగ్గించి, గుండె లయను స్థిరీకరిస్తుంది. ఇది విటమిన్లు, ఖనిజాల మిశ్రమం. రెండు టేబుల్‌స్పూన్ల పీనట్ బటర్ కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, నియాసిన్, ఫాస్ఫరస్, విటమిన్ బీ6, విటమిన్ ఈ, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది.












Click it and Unblock the Notifications