బంగాళదుంప రెగ్యులర్ గా తీసుకుంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
బంగాళదుంప మనకు విరివిగా లభించే కూరగాయాల్లో ఒక్కటి. అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. ఆలుగడ్డలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఆలుగడ్డల్లో మనిషి శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఇవి చాలా తక్కువ ధరలో విరివిగా లభిస్తూ ఉంటాయి. అయితే, బంగాళదుంప ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
బంగాళదుంప తో ఆరోగ్య పరంగా ప్రయోజాలు ఉన్నాయి. అదే వింగా పరిమితి మించినా.. సరైన విధానం పాటించకపోయినా అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళ దుంపలను ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో తీసుకోవడం వల్ల ఇవి టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ సర్వసాధారణం గా మారింది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు ఇన్సులిన్ నిరోధకత పెరిగి.. ఇది క్రమంగా గుండె జబ్బులకు దారి తీస్తుంది. శరీర అవయవాల పనితీరు తగ్గుతుంది. డీప్ ఫ్రై రూపంలో బంగాళదుపంలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఆలుగడ్డలను ఉడికించి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, ఉడికించిన ఆలుగడ్డల కారణంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు వెల్లడించారు.

బంగాళదుంప వినియోగం పై నిపుణుల సూచనలు
కాగా, డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే అధిక ఫైబర్, ప్రోటీన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే నిత్య జీవితంలో కొన్ని చర్యలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. టీ, కాఫీ లను చక్కెర లేకుండా తీసుకోవాలి. ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. బ్రౌన్ రైస్, క్వినోవా, సోర్‌డోఫ్ బ్రెడ్ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా.. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. గింజలు, విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇక బంగాళదుపంల వినియోగ సమయంలో సరైన విధానంలో తీసుకోకపోవడం వల్ల ఇవి డయాబెటిస్ కారణమవుతున్నాయని వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు లభించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications