టేస్టీ టేస్టీ "రొయ్యల నిల్వ పచ్చడి" ఎలా చేయాలంటే..?

సముద్రపు ఆహారం అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. మరి ముఖ్యంగా చేపలతో పాటు ఎక్కువగా తినేవీ అంటే రొయ్యలు అనే చెప్పాలి. రొయ్యల కూర, రొయ్యల ఫ్రై, రొయ్యల పులుసు.. ఇలా ఏ వెరైటీ అయినా కానీ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలానే సీఫుడ్ ప్రియులు తప్పక ఆస్వాదించాల్సిన వంటకం రొయ్యల పచ్చడి. ఘాటైన కారం, నూనె రుచి, మసాలాల సువాసన కలిసి నోరూరించే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ప్రత్యేకత కలిగి ఉంటుంది.

ఈ పచ్చడి రుచికరంగానే కాకుండా పోషక విలువల పరంగానూ మేలు చేస్తుంది. రొయ్యల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉండగా.. జీర్ణక్రియకు కూడా మంచిగా పని చేస్తుంది. తక్కువ సమయంలో సులభంగా తయారయ్యే ఈ వంటకం రోజువారీ భోజనానికి కూడా చక్కగా సరిపోతుంది. సరైన కొలతలు, పద్ధతి పాటిస్తే ఈ "రొయ్యల నిల్వ పచ్చడి"ను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్టీ టేస్టీగా ఉండే "రొయ్యల నిల్వ పచ్చడి" ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

prawn-pickle-making-recipe-in-telugu-with-easy-tips

కావాల్సిన పదార్థాలు..

రొయ్యల మారినేషన్ కోసం:

  • పొట్టు తీసిన రొయ్యలు - అర కిలో
  • పసుపు - అర టీస్పూన్
  • ఉప్పు - ఒక టీస్పూన్
  • మసాలా పొడి కోసం:
  • దాల్చిన చెక్క - 1 ముక్క
  • లవంగాలు - 4
  • యాలకులు - 2
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్

పచ్చడి తయారీకి:

  • నూనె - 150 మిల్లీలీటర్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
  • పసుపు - 1 టీస్పూన్
  • కారం - 4 టేబుల్ స్పూన్లు (రుచికి తగ్గట్టుగా)
  • ఉప్పు - అవసరానికి తగినంత
  • నిమ్మకాయలు - 2

తయారీ విధానం..

  • సుమారు ఒక కిలో మీడియం సైజు రొయ్యలను తీసుకొని పొట్టు తీసి శుభ్రం చేయాలి. కడిగిన తర్వాత ఇవి సుమారు అర కిలో వస్తాయి. నాలుగు నుంచి ఐదు సార్లు నీటితో బాగా కడిగి, నీరు పూర్తిగా వడగట్టాలి.
  • ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు మారినేట్ చేయాలి. దీని వల్ల రొయ్యలలోని ముడివాసన పూర్తిగా పోతుంది.
  • పాన్‌లో తక్కువ మంటపై దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు వేసి స్వల్పంగా రంగు మారే వరకు వేయించాలి.
  • చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • లోతైన కడాయిలో నూనె వేడి చేసి, మారినేట్ చేసిన రొయ్యలను వేసి మధ్యస్థ మంటపై వేయించాలి.
  • రొయ్యలు బంగారు రంగులోకి వచ్చి, కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు 15-20 నిమిషాలు ఫ్రై చేయాలి. (రొయ్యలు బాగా వేయించకపోతే పచ్చడి త్వరగా పాడవుతుంది)
  • వేయించిన రొయ్యలను ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టాలి. అదే నూనెలో మంట తగ్గించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
  • తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు మసాలా పొడి వేసి మంటను తక్కువగా ఉంచి ఒక నిమిషం మాత్రమే కలపాలి. మసాలా మాడకుండా జాగ్రత్త పడాలి.
  • స్టవ్ ఆపి, ముందుగా వేయించిన రొయ్యలను మసాలాలో వేసి బాగా కలిపి పాన్‌ను పక్కన పెట్టాలి.
  • మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయల రసం వేసి మరోసారి కలపాలి.
  • పచ్చడి పూర్తిగా చల్లారాగానే కంటైనర్‌లో నిల్వ చేయాలి. గాలి చొరబడని గాజు లేదా స్టీల్ కంటైనర్ ఉపయోగించాలి.
  • ప్రతిసారి శుభ్రమైన, పొడిగా ఉన్న స్పూన్‌తోనే తీసుకోవాలి. ఫ్రిజ్‌లో ఉంచితే 2 నెలల వరకు తాజాగా ఉంటుంది
  • నిమ్మరసం, నూనె పచ్చడి నిల్వ ఉండేందుకు సహాయపడతాయి

రుచికి మరికొన్ని చిట్కాలు..

ఎక్కువ ఘాటు కావాలంటే కొద్దిగా మిరియాల పొడి కలపవచ్చు

నిమ్మకాయ బదులుగా వెనిగర్ వాడితే కూడా నిల్వ కాలం పెరుగుతుంది

అన్నం, దోస, ఇడ్లీతో పాటు వేడి వేడి రొయ్యల పచ్చడి అద్భుతంగా ఉంటుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+