ఈ కారణాలతోనే మన నరాల ఆరోగ్యం ప్రమాదంలో... జాగ్రత్త!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరంలోని అన్ని అవయవాలు మీదనే కాదు మన శరీరంలోని నరాల వ్యవస్థ పైన మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. శరీరంలోని నరాలు మనం తినకూడని ఆహార పదార్థాలను తిన్నప్పుడు ప్రభావితమవుతాయి. ఆహారాల విషయంలో శ్రద్ధ తీసుకోవడం నరాల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. కొన్ని రకాల ఆహారాలు నరాల ఆరోగ్యాన్ని ఏవిధంగా దెబ్బతీస్తున్నాయి, న్యూరోపతి సమస్యలను ఏ విధంగా పెంచుతున్నాయనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

ఈ ఆహారపు అలవాట్లతో నరాల సమస్యలు

ప్రస్తుత జీవన శైలి విధానంలో ఫాస్ట్ ఫుడ్స్ తినడం ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం నగరాలలో అలవాటుగా మారిపోయింది. ఈ ఆహారాలు మన నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల న్యూరోపతి వంటి సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితి మన నరాలకు నష్టం కలిగించడంతో పాటు కాళ్ళు మరియు చేతులలో నొప్పికి, వాపులకు కారణమవుతుంది.

processed and junk foods causes nerve health issues neuropathy problems

నరాలపైన, మెదడు ఆరోగ్యంపైన ప్రభావం చూపే ఆహారాలు ఇవే

ముఖ్యంగా నూడిల్స్, ప్యాకేజ్ చేసిన స్నాక్స్, రెడీ టు ఈట్ భోజనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వులను పెంచుతాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా నరాలపైన, మెదడు ఆరోగ్యంపైన ఇవి ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా న్యూరోపతి లక్షణాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కండరాల బలహీనతతో నరాల సంబంధిత వ్యాధులతో కష్టపడాల్సి వస్తుంది.

వీటికి అలవాటు పడితే నరాల సమస్యలు పక్కా

అందుకే వైద్యులు నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. నరాల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని భావించేవారు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. వారు విటమిన్లు, ఖనిజాలతో పుష్కలంగా ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకున్నప్పుడు నరాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు బాధించవు. అలా కాకుండా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కు అలవాటు పడితే నరాల సంబంధిత సమస్యలు భవిష్యత్తులో మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి బాధ పెడతాయి.

నరాల ఆరోగ్యం కోసం ఇవి తినండి

ముఖ్యంగా నరాల ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్స్ వంటి ఆహారాలు తీసుకోవడం మంచి లాభాలను ఇస్తుంది. అంతేకాదు సమయం ప్రకారం వ్యాయామం చేయడం తగినంత నీటిని తీసుకుని శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచటం కూడా నరాల పనితీరుకు మద్దతునిస్తుంది.

నరాల ఆరోగ్యం కోసం ఏం తినాలన్న దానిపై అవగాహన అవసరం

ముఖ్యంగా నరాల ఆరోగ్యం కోసం ప్రాసెస్ చేసిన ఆహారాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన నగర వాసులలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారపు ఎంపికలను చేసుకోవడం ద్వారా నరాల సమస్యలను తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలం మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, నరాల వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి మంచి ఆహారం కూడా కీలకమనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+