ఈ వెజిటబుల్ కర్రీ తిన్న తర్వాత టీ తాగడం చాలా డేంజర్ బాస్
శీతాకాలంలో తాజా ముల్లంగి విరివిగా లభిస్తుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సీ, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, యాంటీఆక్సిడెంట్, యాంటీబాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలతో కలిపి ముల్లంగిని తీసుకోవడం వల్ల లాభాలకు బదులు నష్టాలే ఎక్కువ. సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముల్లంగి తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. ఎందుకంటే ముల్లంగి, నీరు జీర్ణక్రియ, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల దగ్గు లేదా గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

2. కీరదోసతో పాటు ముల్లంగిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. సలాడ్లలో చాలామంది కీరదోస, ముల్లంగిని కలిపి తీసుకుంటారు. ఈ రెండింటి కలయిక ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే- సలాడ్‌లో కీరదోస లేదా ముల్లంగి.. ఈ రెండింట్లో ఏదో ఒక దాన్ని మాత్రమే చేర్చుకోవడం మంచిది.
3. నారింజ తిన్న తర్వాత ముల్లంగిని అస్సలు తినకూడదు. ఈ రెండింటి కలయిక విషంతో సమానం. వీటిని కలిపి లేదా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే తినడం వల్ల అనేక కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.
4. టీ తాగిన తర్వాత ముల్లంగి తినడం, ముల్లంగితో తయారు చేసిన కర్రీని తిన్న తర్వాత టీ తాగడం చాలా ప్రమాదకరం. దీనివల్ల మలబద్ధకం, ఎసిడిటి వంటి సమస్యలు వస్తాయి. ముల్లంగి సహజంగా చలువ చేస్తుంది, టీ వేడి చేస్తుంది. కాబట్టి ఈ రెండూ పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. అందుకే టీ తాగిన తర్వాత ముల్లంగిని లేదా ముల్లంగి వంటకాలు తినకూడదు. ఆ అలవాటును మానుకోవాలి.
5. ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగడం కూడా మంచిది కాదు. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో ముల్లంగి సలాడ్ లేదా కూరగాయలు తిన్నట్లయితే, పాలు తాగడం మానుకోండి. పాలు, ముల్లంగి ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు. ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగితే చర్మంపై దద్దుర్లు, దురద వచ్చే అవకాశం ఉంది. అలాగే, ముల్లంగి పరాఠా లేదా ఇతర ముల్లంగి వంటకాలతో పాలు తాగకుండా జాగ్రత్త పడాలి.
Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది ఎలాంటి మందులు లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.












Click it and Unblock the Notifications