వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!!
వేసవిలో ఎండ తీవ్రత పెరుగుతోంది. శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుకోవటం అవసరం. ఈ కాలంలో శీతల పానీయాల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ, అవి ఇచ్చే ఉపశమనం తాత్కాలికమే కాకుండా, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, వేసవిలో శరీరానికి కావాల్సిన శక్తిని అందించే అద్భుత పానీయం రాగి జావ. ప్రాచుర్యం పొందిన పోషక పదార్థం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటం లో సహకరిస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే, ఈ రాగి జావ ఎంత మంచిదో... అతిగా తీసుకుంటే సమస్యలు ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మరింత శక్తివంతగా పని చేస్తుంది. అదే విధంగా జీర్ణ వ్యవస్థ పని తీరు ను మెరుగు పరుస్తుంది. కడుపులో సహజంగా వచ్చే సమస్యల నియంత్రణలో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా కడుపు నిండుగా ఉండటంతో పాటుగా బరువు తగ్గించటంలోనూ సహాయ కారిగా నిలుస్తుంది. రాగిజావ సహజ సిద్దంగా శరీరానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం.. పోషకాలు ఎంత గానో ఉపకరిస్తాయి. చర్మానికి కావాల్సిన తేమను అందించి..ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరి స్తుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ జావ మేలు చేస్తుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మోతాదు తక్కువగా ఉంటుంది. దీని కారణంగా చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంచుతూ.. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదయం వేళలో తీసుకోవటం ద్వారా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే.. ఎముకలకు బలాన్నిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్ కణాల పునరుద్దరణకు సహకరిస్తుంది. ఇక, ఇదే సమయంలో రాగిజావ కు ప్రతీ రోజు ఒక సమయం కేటాయించి.. ఆ టైమ్ లో తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

రాగిజావ వినియోగం పై నిపుణుల సూచనలు
రాగిజావ వినియోగంలోనూ కొన్ని సూచనలు చేస్తున్నారు. రాగి జావ ఉదయం వేళ తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. రాత్రి సమయంలో కొందరికి ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు. అదే విధంగా మూత్రాయశయ సమస్యలు... కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు రాగిజావ తీసుకోకపోవటం మంచిదని సూచిస్తున్నారు. బరువు పెరగాలనుకొనే వారికి రాగిజావ వలన ప్రయోజనం ఉండదు. అదే విధంగా మోతాదు మేరకు వినియోగిస్తే సమస్యల ఉండవని.. అంతకు మించి తీసుకుంటే కడుపులో ఉబ్బరం తో పాటుగా డయేరియాకు అవకాశం ఉంటుందని అలర్ట్ చేస్తున్నారు. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు వైద్యుల సూచనల మేరకే రాగిజావను తీసుకోవటం మంచిది. ప్రస్తుతం ఇన్ స్టంట్ గా వస్తున్న రాగిజావ కంటే ఇంట్లో తయారు చేసుకునే రాగిజావ ఆరోగ్య రీత్యా మంచిది. సహజసిద్ధమైన డ్రింక్ గా భావించే రాగిజావ వలన ఎన్నో ప్రయోజాలు ఉన్నా.. వినియోగంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు.
-
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
మునక్కాయ శనగపప్పు కూర ఇలా చేస్తే అద్భుతః! -
షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం













Click it and Unblock the Notifications