సగ్గుబియ్యం దోసెలు.. ఇలా చేసి తింటే సూపర్ టేస్ట్!

సాధారణంగా మనం తినే అల్పాహారం రొటీన్ గా ఉంటుంది. ఇక రొటీన్ కు భిన్నంగా, ఇడ్లీ, దోసె వంటి వాటికి బదులుగా కొన్ని రకాల అల్పాహారాలు రుచిని ఇవ్వడమే కాకుండా, మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అటువంటి అల్పాహార లో సగ్గుబియ్యం దోసెలు ఒకటి.

సగ్గుబియ్యం దోసెలు

ఈ సగ్గుబియ్యం దోసెలను ఏ విధంగా తయారు చేయాలి? వాటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? సగ్గుబియ్యం దోసెల రుచి ఏ విధంగా ఉంటుంది? అనేది తెలుసుకుందాం. సగ్గుబియ్యం దోసెలు బయట కరకరలాడుతూ, లోపల చాలా మృదువుగా ఉంటాయి. ఇక సగ్గుబియ్యం దోసెలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం.

saggubiyyam dosa good for health and super tasty this is the making process of sabudana dosa

కావలసిన పదార్థాలు

సగ్గుబియ్యం - ఒక కప్పు

బియ్యం- ఒక కప్పు

పెరుగు- అర కప్పు

ఆలుగడ్డ ముక్కలు- నాలుగు చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నవి

ఉప్పు- తగినంత

నూనె- దోసెలు తయారీ కోసం

నీరు- అవసరానికి సరిపడా

తయారీ విధానం

ముందుగా సగ్గుబియ్యాన్ని, బియ్యాన్ని వేరువేరుగా 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో పెరుగు ఉప్పు వేసి బాగా కలిపి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పులియనివ్వాలి. ఇక దోశ పిండి లాగా దీని చిక్కదనాన్ని చూసుకోవాలి. బాగా గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసుకుని కలుపుకోవాలి.

దోసెలు ఇలా కాల్చుకోవాలి

దోసెలు వేయడానికి పాన్ పొయ్యి మీద పెట్టి, పాన్ వేడి అయిన తర్వాత పిండిని వేసి దోసెలా అని పలుచగా రుద్దాలి. ఆ తర్వాత కొద్దిగా నూనె వేసి దోసెల మాదిరిగానే కాల్చుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి. అంతే రుచికరమైన సగ్గుబియ్యం దోసెలు రెడీ.

రొటీన్ కు భిన్నంగా టిఫిన్ చెయ్యాలంటే ఈ సగ్గుబియ్యం దోసెలు

ఈ దోసెలను కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీ తో కానీ, అల్లం చట్నీతో కానీ పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. రొటీన్ కి భిన్నంగా టిఫిన్ చేసుకోవాలనుకునే వారు ఈ సగ్గుబియ్యం దోసెలను ట్రై చేయొచ్చు. ఒక్కసారి తింటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+