Health News: ఎండా కాలం ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి..!
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే ఇంతగా ఎండలు ఉంటే ఏప్రిల్, మే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎండల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వడ దెబ్బతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతే కాదు కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందట.
ఉదయం 10 గంటలలోపు
ఈ ఎండ కాలం పిల్లలను ఎండలో ఎక్కువగా ఆడుకొనివ్వద్దని సూచిస్తున్నారు. ఆఫీస్ లకు వెళ్లేవారు ఉదయం 10 గంటలలోపు వెళ్లాలని.. ఇంటికి వచ్చే వారు సాయంత్రం 4 గంటల తర్వాత రావాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే చెవులకు వడ గాలి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని చూస్తున్నారు. ఎండ కాలం నూనె పదార్థలు ఎక్కువగా తినకుండా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే దోసకాయ, వాటర్ మిలన్, ఇతర పండ్లు తినాలని సూచిస్తున్నారు.

శీతాలపానీయాలు
చాలా ఎండకాలం శీతాలపానీయాలు తాకుంటారు. వీటి బదులు కొబ్బరి బొండ, చెరుకు రసం తాగడం మంచిది. ముఖ్యంగా ఎండకాలం నీరు ఎక్కువగా తాగాలి లేకుంటే డిహైడ్రెషన్ సమస్య రావొచ్చు. ఎండకాలం ఎక్కువగా చెమట పడుతుంది. దీంతో శరీరంలో నీరు తగ్గుతుంది. దీని వల్ల కిడ్నీల సమస్యలు వచ్చే అవకాసం ఉంటుంది. నీటిశాతం తగ్గటం ఎక్కువసేపు కొనసాగితే ఆకస్మికంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే నీటిని తాగాలని సూచిస్తున్నారు.

ఉప్పు
ఎండకాలం ఉప్పు తగ్గించడం మంచిది. ఉప్పు ఎక్కువగా వాడితే బీపీ పెరుగుతుంది. అలాగే కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే ఎండకాలం త్వరగా జీర్ణ అయ్యే పదార్థలు తీసుకోవాలి. ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ ఎండకాలంలోకొరత కారణంగా నీరు కాలుష్యానికి గురై అవకాశం ఉంటుంది. కాలుషితమైన నీరు తాగడం వల్ల అతిసార, టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications