ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..!?
ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర అంతే ముఖ్యం. నిద్రపోవటం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. శారీరకంగానూ.. మానసికంగా నిద్ర చాలా అవసరం. కానీ నేటి కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్ర పోలేకపోతున్నామంటూ వైద్యులను సంప్రదిస్తున్నారు. ప్రతీ రోజూ 6 గంటలకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది. నిద్రలేమి కారణంగా హైపర్ టెన్షన్ మరింత పెరుగుతుంది. నిద్ర లేకపోతే ఏం జరుగుతుందీ.. మంచి నిద్ర ఎలా అలవాటు చేసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. నిద్రపోవటం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. శారీరకంగానూ.. మానసికంగా నిద్ర చాలా అవసరం. ప్రతీ రోజూ 6 గంటలకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది. నిద్రలేమి కారణంగా హైపర్ టెన్షన్ మరింత పెరుగుతుంది. తగినంత నిద్రపోకపోతే మీ మెదడు సరిగ్గా పనిచేయదు. నిద్ర లేకపోవడం వల్ల చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన చర్మంపై ముడతలు, నల్లటి వలయాలు కనిపిస్తాయి. దీని ఫలితంగా ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఆందోళన, చిరాకు, రక్తపోటు, ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా మనం నిద్రపోతున్నపుడు హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ 10 నుంచి 20 శాతం తగ్గుతాయి. తద్వారా గుండె, రక్త నాళాలు విశ్రాంతి పొంది, రికవర్ అవుతాయి.

ఆరు గంటల నిద్ర తగ్గితే... తీవ్ర ప్రభావం
రోజుకు 6 కంటే తక్కువ గంటలు నిద్రపోయే వారిలో హైపర్ టెన్షన్ 20 నుంచి 32 శాతం అధికంగా వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరగటం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది. రక్త నాళాలు కుంచించుకుపోతాయి. అంతేకాదు.. తగినంత నిద్రపోలేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. హైపర్ టెన్షన్ సమస్య ఉన్నవారిలో సగం మందికి అసలు తమకీ సమస్య ఉందనే తెలియదు. బీపీని కంట్రోల్లో ఉంచాలన్నా 7 నుంచి 9 గంటలు మంచి నిద్ర ఉండాల్సిందే. మగత నిద్ర వల్ల శరీరానికి ఎలాంటి లాభం ఉండదు. ప్రతీ రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. ఒకే సమయానికి లేవాలి. నిద్రలేమి, గురక ఇతర సమస్యలపై తప్పకుండా దృష్టిపెట్టాలి. నిద్రపోయే ముందు సెల్ ఫోన్ అస్సలు వాడకూడదు. రోజుకు ఆరు గంటల కన్నా తక్కువ నిద్రపోవడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్, ఊబకాయం, మధుమేహం, నిరాశ, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. దీంతో.. నిద్రకు దూరంగా కాకుండా జాగ్రత్తలు పడటం అవసరం.













Click it and Unblock the Notifications