రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోకుంటే ఈ రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే!

నిద్రలేమి.. ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ప్రతీ ఒక్కరూ ప్రతీరోజూ రాత్రి కనీసం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల పాటు అయినా నిద్ర పోవాలి. అయితే నిద్ర లేకపోవటం కారణంగా అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జీవన శైలి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రలేమి సమస్య దైనందిన జీవితంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

నిద్రలేమితో జీవనశైలి వ్యాధులు

ఎవరైతే నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారో వారు మధుమేహం, రక్తపోటు వంటి ఇతర అనారోగ్య సమస్యలను ప్రమాదాన్ని కలిగి ఉంటారు. నిద్రలేమి కారణంగా శరీరంలో ఇన్సులిన్ నియంత్రణా సామర్ధ్యం ప్రభావితం అవుతుంది. ఇది మధుమేహానికి దారి తీస్తుంది. ఇది రక్తపోటును కూడా పెంచుతుంది. ఈ అధ్యయనం ప్రకారం 30% భారతీయులలో పెద్దవారు నిద్ర రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇవి వారిలో ఈ ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయని చెప్తున్నారు.

Sleeplessness rings danger bells to Lifestyle Diseases

ఈ కారణాలతోనే నిద్రలేమి

నిద్రలేమి సాధారణంగా ఒత్తిడి, విపరీతమైన పని గంటలు మరియు అధిక స్క్రీన్ సమయం వలన కూడా కలుగుతుంది. ఈ అంశాలు శరీరంలోని సహజ నిద్ర చక్రాన్ని భంగం చేస్తాయి. నిద్రలేమి కారణంగా దైనందిన జీవితం ప్రభావితం అవుతుంది. ప్రొడక్టివిటీ తగ్గుతుంది. అందుకే నిద్రలేమి సమస్యను అధిగమించటం కోసం నిద్రకు ముందు స్క్రీన్ సమయం తగ్గించుకోవాలి. అలాగే జీవితంలో ఒత్తిడిని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను చేసుకోవాలి.

నిద్రలేమి తగ్గించుకోటానికి ఇలా చెయ్యండి

ప్రతి రాత్రి ప్రతీ ఒక్కరూ ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోయేలా ప్లాన్ చేసుకోవాలి. నిద్ర పోయే ముందు కాసేపు మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్ వంటిది చేస్తే ఇంకా మంచిది. సాధారణ వ్యాయామం మరియు సమతుల్య ఆహారం కూడా ఒత్తిడిని నిర్వహించడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిద్రలేమి కారణంగా వచ్చే జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుంది.

నిద్రలేమి సమస్యను పరిష్కరించకుంటే ప్రమాదంలో ఆరోగ్యం

ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా నిద్రకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. నిద్రలేమి కారణాలను అర్థం చేసుకోవడంతో పాటు, నిద్రలేమి సమస్యలను పరిష్కరించటం ద్వారా వ్యక్తులు మెరుగైన జీవన విధానం వైపు అడుగులు వేస్తారు. లేదంటే నిద్రలేమి సమస్య జీవితంలో భయంకరమైన జీవనశైలి వ్యాధులకు కారణంగా మారుతుంది. మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+