వర్షాకాలంలో ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి
వర్షాకాలంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న రోగాలు చుట్టుముడుతుంటాయి. సాధ్యమైనంతవరకు కాచి చల్లార్చిన నీటిని తాగుతుండాలి. మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గేదే వర్షాకాలంలో. ఇది పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మన రోజువారీ ఆహారంలో మసాలా దినుసులను చేర్చుకోవాలి. చక్కటి రుచితోపాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆ దినుసుల గురించి తెలుసుకుందాం.
నల్ల మిరియాలు : ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే జీవక్రియను కూడా పెంచుతాయి. దగ్గు, గొంతు నొప్పి ఉంటే నల్ల మిరియాలను తీసుకుంటే తగ్గిపోతుంది. నిద్రపోయే ముందు వేడి వేడి పాలల్లో మిరియాలు వేసుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచింది.

పసుపు : అందరి ఇళ్లల్లో కచ్చితంగా పసుపు ఉంటుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు దీనిలో పుష్కలం. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి తోడ్పడతాయి. ప్రతిరోజు రాత్రిపూట పసుపు పాలు తాగుతుండాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
లవంగం : ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీనిలో మెండు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వర్షాకాలంలో లవంగాలను తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. లవంగాల్లో కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. పురుషుల్లో లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. ప్రతిరోజు పరగడుపునే 3 లవంగాలను నమిలి తినడంవల్ల శృంగార జీవితం మెరుగు పడుతుంది.
దాల్చిన చెక్క : ఇందులో అద్భుత ఔషధ గుణాలున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు గ్లాసు పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం, వికారం నివారణ కోసం వాడతారు. కడుపు పూతల నివారణకు, ఆకలిని మెరుగుపరచడానికి దాల్చినచెక్క ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications