చింతగింజలు పారేస్తున్నారా? ఇది తెలిస్తే బంగారంలా దాచుకుని వాడుకుంటారు!
మనం వంటల్లో చింతపండు వాడిన తర్వాత చింతపండు గుజ్జు తీసి గింజలను చెత్తబుట్టలో పారేస్తూ ఉంటాం. . కానీ చింత గింజల్లో శరీరానికి మేలు చేసే ప్రొటీన్లు, పీచు, ఖనిజాలు దాగి ఉన్నాయని తెలిస్తే మళ్లీ పారేయరు. బంగారంలా దాచుకుని వాడుకుంటారు.
ప్రాచీన కాలం నుంచి భారతీయ వంటల్లో చింతపండు ముఖ్యమైనది. పులుపు, రుచి ఇవ్వడమే కాదు, పోషకాలు కూడా అందిస్తుంది. చింతపండు గుజ్జులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సహాయపడతాయి. అయితే చింత గింజలను చాలామంది పనికిరానివిగా భావిస్తారు. నిజానికి సాంప్రదాయ ఆయుర్వేదంలో, ఆధునిక అధ్యయనాల్లో కూడా ఈ గింజల్లో విలువైన పోషకాలు ఉన్నట్లు తెలుస్తోంది.

చింత గింజలలో ప్రొటీన్లు, పీచు, కీలక ఖనిజాలు ఉంటాయి. కానీ పచ్చిగా తినకూడదు. పెనం మీద దోరగా వేయించడం, నానబెట్టడం లేదా పై పొర తీసి దంచడం ద్వారా శుద్ధి చేసి మాత్రమే వీటిని తినాలి. అలా చేస్తే చింత గింజలు జీర్ణం కావటం సులభం అవుతుంది, వీటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.సరైన పద్ధతిలో శుద్ధి చేయకుండా పచ్చి గింజలు తీసుకుంటే అజీర్తి, కడుపునొప్పి లేదా పేగుల సమస్యలు రావచ్చు.
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మందులు వాడేవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. మితంగా, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటేనే మేలు చేస్తాయి.చింత గింజలను వేయించి పొడి చేసి పిండిలో కలపవచ్చు. లేదా సూప్‌లు, చట్నీల్లో కొద్దిగా వాడవచ్చు. కొందరు కాఫీలా కూడా తాగుతారు. ఇలా వాడితే వృథా కాకుండా పోషకాలు అందుతాయి.
ఇంట్లో చింతపండు వాడినప్పుడు గింజలను కడిగి ఎండబెట్టి దాచుకోండి. అవసరమైనప్పుడు వేయించి వాడుకోండి.మోకాళ్ళ నొప్పులకు చింత గింజల పొడి దివ్య ఔషధంగా పని చేస్తుంది. మొత్తంగా చూస్తే చింత గింజలు పారేసేవి కావు. సరైన పద్ధతిలో వాడితే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇకపై పారేయకుండా దాచుకుని వాడుకోండి. చిన్న మార్పుతో పోషకాలు ఇంట్లోనే లభిస్తాయి.













Click it and Unblock the Notifications
