ఆత్మహత్య ఆలోచన వారిలోనే ఎక్కువ.. స్మార్ట్ ఫోన్ తో చేటు; షాకింగ్ అధ్యయనం!!
స్మార్ట్ ఫోన్లు అతిగా వినియోగించడం అనర్ధాలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఒక షాకింగ్ అధ్యయనం కూడా బయటకు వచ్చింది.
చాలామంది స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ లో వచ్చే వీడియోలు చూడడం, సోషల్ మీడియాకు అడిక్ట్ అవడం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా స్మార్ట్ ఫోన్లలో రకరకాల గేమ్స్ ఆడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే స్మార్ట్ ఫోన్లు అతిగా వినియోగించడం అనర్ధాలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తో మీకు ఎంటర్టైన్మెంట్ పక్కనపెట్టి కొత్త కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉందని, ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ వినియోగంతో బోలెడు నష్టాలు
స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా అనర్ధాలు చోటుచేసుకుంటాయి. ఫోన్ల నుండి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ ల వినియోగం వల్ల కళ్ళ సమస్యలు వస్తాయని అంటున్నారు. నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. అంతేకాదు పలు ఇతర దుష్పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానసిక రుగ్మతలు కలిగే అవకాశం ఉందని, డిప్రెషన్ కు లోన్ అయ్యే ప్రమాదం ఉందని ఇటీవల కెనడాకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తెలియజేశారు.

తాజా అధ్యయనంలో షాకింగ్ విషయం
స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు తొందరగా వస్తాయని టోరెంట్ వెస్ట్రన్ హాస్పిటల్ పరిశోధకులు తమ అధ్యయనం ద్వారా తెలియజేశారు. ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల శారీరిక అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు, మానసిక అనారోగ్యం కూడా చోటు చేసుకుంటుందని డిప్రెషన్ లోనే చీటికిమాటికి తీవ్ర సహనానికి గురవుతూ ఉంటారని, చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూసి బాధపడుతూ ఉంటారని పేర్కొన్నారు. అంతేకాదు వారిలో పదేపదే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో వారు తేల్చారు.

స్మార్ట్ ఫోన్ లు అతిగా వాడితే కచ్చితంగా ఆ సమస్య
అందుకే స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా స్మార్ట్ ఫోన్ లను వాడితే, 24 గంటలు ఫోన్ లో నుంచి తల బయట పెట్టకుండా అదే పనిగా ఫోన్లు వాడితే కచ్చితంగా ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళతారని చెబుతున్నారు. ఎంజాయ్ మెంట్ కోసం స్మార్ట్ ఫోన్ వినియోగం మొదలుపెడితే చివరికి అది ఆత్మహత్య చేసుకునేదాకా పరిస్థితిని తీసుకు వెళుతుందని, అందుకే స్మార్ట్ ఫోన్ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అంటున్నారు.












Click it and Unblock the Notifications