తెలంగాణలో చలి పంజా: డిసెంబర్‌లో మరింత పెరుగుతుందని హెచ్చరిక!

రాష్ట్రంలో చలి రోజురోజుకూ బలపడుతోంది. చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గాయి. సోమవారం నమోదైన వివరాల ప్రకారం, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 11.7 డిగ్రీల సెల్సియస్‌తో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది.

మిగతా ప్రాంతాల్లో పరిస్థితి చూస్తే పటాన్‌చెరులో 12.4డిగ్రీల సెల్సియస్‌, రాజేంద్రనగర్లో 13.0 డిగ్రీల సెల్సియస్‌, శివ్వంపేటలో 13.3డిగ్రీల సెల్సియస్‌, సిర్పూర్ (యు)లో 13.4డిగ్రీల సెల్సియస్‌, తిర్యాణిలో 13.6డిగ్రీల సెల్సియస్‌, కెరమెరి, వాంకిడిలో 15.3డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయింది.

Telangana cold wave Telangana Shivers as Cold Wave Intensifies Kohir Records 11 7 C IMD Warns of Colder December

హైదరాబాద్‌లో తెల్లవారుజామున ప్రధాన రోడ్లపై పొగమంచు కమ్ముకుంటోంది. దాంతో వాహనదారులకు దారి కనిపించక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా చలి తగ్గడం లేదు, అందుకే విద్యార్థులు, ఉద్యోగులు స్వెటర్లు, మాస్కులతో బయటికి వస్తున్నారు. పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తగ్గడంతో మధ్యాహ్నం వేళ సైతం చల్లని గాలులు వీస్తున్నాయి.

బేగంపేట వాతావరణ కేంద్రం చెప్పిన దాని ప్రకారం, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు ఎక్కువే. అయినా చలిగాలుల తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగి, డిసెంబర్ నాటికి మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఇప్పుడు క్యూర్ పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, చలిగాలుల తీవ్రత మాత్రం అధికంగా ఉందని బేగంపేట వాతావరణ శాఖ వెల్లడించింది

శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా, గుండె సమస్యలు ఉన్నవారు. చలికి శ్వాసకోశ ఇబ్బందులు పెరగవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తెల్లవారుజామున, రాత్రి ఆలస్యంగా బయటికి వెళ్లడం తగ్గిస్తే మంచిది. చెవులు, ఛాతీ కప్పే వెచ్చని దుస్తులు వేసుకుంటే మంచిది. గోరువెచ్చని నీరు, వేడి సూప్‌లు, తాజా ఆహారం తీసుకోండి.

తెలంగాణాలో తొలిసారిగా జాతీయస్థాయి క్రీడా సంబరం 'ఖేలో ఇండియా 2026' సందడి!
తెలంగాణాలో తొలిసారిగా జాతీయస్థాయి క్రీడా సంబరం 'ఖేలో ఇండియా 2026' సందడి!

చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ వాడండి. పొగమంచు సమయంలో లో-బీమ్ లైట్లు వేసి, వేగం తగ్గించి నడపండి. శ్వాస ఇబ్బంది, జ్వరం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+