ప‌ర‌గ‌డుపునే పుదీనా ఆకుల‌ను తింటే - ఆ మందుల కంటే పవర్ ఫుల్..!!

పుదీనా. ఒక ప్రత్యేకత స్వభావం కలిగినది. పుదీనా ఎన్నో అద్భుత‌మైన ఔషధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. అనేక మందుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. పుదీనా ఆకుల‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు ఉన్నాని ఆయుర్వేద వైద్యుల మాట. అనేక వ్యాధులను తగ్గించటంలో పుదీనా క్రియాశీలకంగా పని చేస్తుంది. రోజూ ఉద‌యం ప‌రగ‌డుపునే ఈ పుదీనా ఆకుల‌ను తింటే జీర్ణాశ‌య ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి అవుతాయి. అదే విధంగా జీర్ణ సమస్యలతో పాటు గా మరెన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

పుదీనా ఆకులు జీర్ణ వ్య‌వ‌స్థ‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. రోజూ ఉద‌యం ప‌రగ‌డుపునే ఈ ఆకు ల‌ను తింటే ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్తి త‌గ్గుతుంది. అలాగే క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, క‌డుపు నొప్పి, వికారం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. పుదీనా ఆకుల్లో యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. దీంతో నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. పుదీనా ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోరు ఆరోగ్యంగా ఉంటుంది. పుదీనా ఆకుల‌ను ఉద‌యం తింటే శ‌రీర మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. ఇది క్యాల‌రీలు ఖ‌ర్చయ్యేలా చేస్తుంది. దీంతో కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఖాళీ క‌డుపుతో ఈ ఆకుల‌ను తింటే శ‌రీరం లోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోయి శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా లివ‌ర్‌, కిడ్నీలు క్లీన్ అవుతాయి. ఆయా భాగాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

the-health-benefits-of-mint-leaves-on-an-empty-stomach-here-the-information

ఇక, పుదీనాలో ఉండే మెంథాల్ స‌హ‌జ‌సిద్ధ‌మైన డికంజెస్టెంట్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం క‌రిగిపోతుంది. శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ్వాస‌ నాళా ల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా, బ్రాంకైటిస్ వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. పుదీనాను తీసుకోవ‌డం వ‌ల్ల దాని వాస‌న‌కు, అందులో ఉండే సమ్మేళ‌నాల‌కు ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. పుదీనాలో అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు, రోజ్‌మ‌రినిక్ యాసిడ్‌, ఫ్లేవ‌నాయిడ్స్‌, విట‌మిన్ సి ఉంటాయి. ఇవ‌న్నీ ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గి స్తాయి. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ స‌మ్మేళ‌నాలు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చ‌ర్మంలో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీని వ‌ల్ల మొటిమ‌ లు, మచ్చ‌లు, ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. పుదీనా ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే 5 నుంచి 7 న‌మిలి తినాలి. ఇలా.. పుదీనా ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు పొందవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+