అధిక బరువుతో అనర్థాలు ఎన్నో..
అధిక బరువు చాలామంది మహిళల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఉబకాయం వల్ల ఇంటి, ఆఫీసు పనులు సరిగా చేసుకోలేకపోతున్నారు. కొందరిది కూర్చుంటే లేవలేని పరిస్థితి. మరికొందరు అడుగుతీసి అడుగు వేయలేకపోతున్నారు. మహిళల్లో ఉబకాయానికి సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడికి గురికావడం, హార్మన్ల అసమతుల్యత ప్రధానకారణమని వైద్య నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల మందుల ప్రభావంతో కూడా మహిళలు లావెక్కుతారని వైద్యుల అంటున్నారు. బరువు పెరగడం వల్ల హార్ట్ ఎటాక్, హార్టస్ట్రోక్ వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని హెచ్చరిస్తున్నారు.
మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి...:సాధారణంగా మహిళల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనిని ఎదుర్కొవడానికి ట్రుడినల్ గ్రంథులు దోహదపడతాయి. ఇవి కార్డిసోల్‌ని ఎక్కువగా విడుదల చేస్తాయి. దీని ప్రభావం వల్ల మహిళలు ఎక్కువగా బరువు పెరుగుతారు. కాబట్టి, మహిళలు మానసిక ఒత్తిడిని జయించేందుకు ముందుగా ప్రయత్నించాలి. మనసు ప్రశాంతంగా ఉండేందుకు మంచి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, హాస్య సన్నివేశాలు చూడడం వంటివి చేయాలి.

సమతుల్య ఆహారం ఎంతో అవసరం..:బరువు పెరగడానికి భోజనమే ప్రధానమని చాలామంది భావిస్తుంటారు. ఈ భయంతో అన్నం తినడం కూడా మానేస్తుంటారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. భోజనం చేయడం మానేస్తే బరువు తగ్గడం వంటేదేమీ ఉండదు. పైగా ఇంకాస్త బరువు పెరిగే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లు సరిగా పాటించకపోవడం వల్ల కూడా బరువెక్కుతారు. సమయానికి తినడమే కాకుండా సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలి.
అతిగా మందులు వాడొద్దు..:చాలామంది చీటికి మాటికి మందులు వాడుతూ ఉంటారు. డాక్టరుని సంప్రదించకుండానే సొంతంగా మెడికల్ షాపుల నుంచి మందులు కొనుక్కుని వేసుకుంటారు. అది మంచి పద్ధతి కాదు. కొన్నిరకాల మందులు దుష్ర్పభావాన్ని చూపుతాయి. బరువు పెరగడానికి కూడా అవి కారణం అవుతాయి. కాబట్టి వైద్యున్ని సంప్రదించకుండా మందులు వేసుకోకూడదు. ముఖ్యంగా డిప్రెషన్, మధుమేహం, గర్భనిరోధక మాత్రలు వాడేవారు ఈ విషయంలో మరికాస్త జాగ్రతత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అతిగా తినొద్దు..:శారీరకంగా శ్రద్ధ చేయనివారు వేగంగా బరువు పెరుగుతారు. పైగా ఎప్పుడూ అలసటగాను, నీరసంగానూ ఉంటారు. ఇలాంటివారు తమను తాము ఉత్సాహంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ చురుక్కుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి.
వ్యాయమం అనేది ప్రతిఒక్కరికి ఎంతో అవసరం. మహిళలు ఎక్కువగా దీనిపై శ్రద్ధ పెట్టాలి. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు.
విపరీతంగా ఆకలి పెరిగితే శరీరానికి చాలా నష్టం. ఆకలి పెరగడంతో అతిగా తింటారు. తద్వారా బరువు పెరుగుతారు. కావాల్సిన క్యాలరీల కన్నా అధికంగా శరీరంలో చేరి కొవ్వులా మారడం వల్ల ఇది జరుగుతుంది. అందువల్ల ముందునుంచే అప్రమత్తంగా ఉండాలి.












Click it and Unblock the Notifications