Health News: ఎండా కాలంలో ఈ పదార్థాలు అస్సలు తినకండి..!
సమ్మర్ వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని అలవాట్లతో పాటు ఆహార పదార్థులు కూడా మార్చాలి.
ఇప్పుడు వేడి ఎక్కవ ఉంటుంది. అందుకే కాఫీ తాగడం తక్కువ చేయాలి లేకుంటే మొత్తానికే తాగడం మానేయాలి.
ఎండా కాలం ఆవకాయ ఎక్కువగా తినకూడదు. ఆవకాయలో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల దాహం పెరుగుతుంది.
ఎండా కాలం ఎక్కువగా జంక్ ఫుడ్ తినకూడదు. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్నే తీసుకోండి. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఎండకాలం మాసాల ఫుడ్ ఎక్కువగా తీసుకొవద్దు. నాన్ వెట్ కంటే వెజ్ ఆహార పదార్థలు తీసుకోవాలి. అలాగే క్యాలరీలు ఎక్కువగా ఉండే మిల్క్ షేక్స్, షుగర్ ఫుడ్స్ తీసుకొవద్దు. ఇవి శరీరంలో నీటి శాతాన్ని గ్రహిస్తాయి.

సమ్మర్ లో ఫ్రైడ్ ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ఉప్పును తగ్గించుకోవాలి ఉప్పు శరీరంలోని నీటి శాతాన్ని ఆకర్షిస్తుంది. చాలా మంది ఎండ కాలం రాగానే కూల్ డ్రిక్స్, ఐస్ క్రీములు ఎక్కువగా తింటారు. కానీ వీటిలో ఉండే కొవ్వు ఉంటుంది. దీని వల్ల శరీరం వేడెక్కుతుంది. అందుకే ఎండా కాలం నీరు ఎక్కువగా ఆహార పదార్థలు తీసుకోవాలి. కీరదోస, వాటర్ మిలన్ తీసుకోవాలి.
పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండడంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, విటమిన్-సి సహా పలు రకాల పోషకాలు ఉన్నాయి.

కెరోటినాయిడ్, లైకోపీన్, కుకుర్బిటాసిన్ సహా పలు యాంటీఆక్సిడెంట్లు పుచ్చకాయలో ఉంటాయి. ఒంటికి చలువ చేసే కీరదోసకాయి తినడం మంచిది. బీరకాయ, సోరకాయ లాంటి నీటిశాతం ఎక్కువ ఉండే కూరగాయలను వంటల్లో ఉపయోగించాలి.
ఎండా కాలం పండ్లు ఎక్కువగా తినాలి. ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే సమ్మర్ లో ఎక్కువగా నీరు తాగాలి. నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాదు.












Click it and Unblock the Notifications