ఈ పండ్లలో చక్కెర ఎక్కువ.. తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి!!
పండ్లు ఏవైనా సహజంగా తియ్యగా ఉంటాయి. ఇలా సహజ సిద్ధమైన చక్కెర ఉంటుంది. అయితే బయట మనం తినే చక్కెరకు పండ్లలో ఉండే సహజ చక్కెరకు ఉంటుంది. చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులు తియ్యని పండ్లను తినాలంటే భయపడుతూ ఉంటారు . వాటిలో ఉండే చక్కెర కారణంగా తమ రక్తంలో చక్కెర పెరుగుతుందని అనుమానపడుతూ ఉంటారు. ఏవైనా పండ్లు తినాలంటే కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు.
ఈ పండులోనే ఎక్కువ చక్కెర
అయితే పండ్లలో ఎక్కువ చక్కెర ఉండే పండ్లు ఏంటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. పండ్లలో ఎక్కువ చక్కెర ఉండే పండుగా మామిడి పండును చెబుతారు. మామిడి పండ్లు పండ్లలో రారాజు. వేసవిలో వచ్చే సీజనల్ ఫ్రూట్ అయినా మామిడి పండ్లను తినడం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.

మామిడి పండ్లలో చక్కెర ఇలా
అయితే మామిడి పండులో అన్ని పండ్ల కంటే ఎక్కువ చక్కెర ఉంటుంది. మీడియం సైజు మామిడి పండులో 45 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదు అనేది గుర్తుంచుకోవాలి. బరువు తగ్గాలి అనుకునే వారు, మధుమేహంతో బాధపడేవారు మామిడి పండును ఎక్కువ మోతాదులో తినకూడదు.
చక్కర ఎక్కువగా ఉండే పండ్లు ఇవే
ద్రాక్ష పండ్లలో కూడా ఎక్కువ చక్కెర ఉంటుంది. ఒక కప్పు ద్రాక్ష పళ్లలో దాదాపు 23 గ్రాముల చక్కెర ఉంటుంది. ద్రాక్ష పండ్లు ఎక్కువగా తినడం మంచిది కాదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా ద్రాక్షపండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిని తక్కువ క్వాంటిటీ లో తింటేనే మంచిది.
చెర్రీస్, పియర్, అరటి పండ్లలో ఉన్న చక్కెర ఇలా
ఇక చెర్రీ పండ్లలో కూడా ఎక్కువ చక్కెర ఉంటుంది. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర ఉంటుంది. చెర్రీస్ కూడా మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా తినకూడదు. ఒక మీడియం సైజ్ పుచ్చు ముక్కలో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. అంతే కాదు ఒక పియర్ పండు లో కూడా 17 గ్రాముల చక్కెర ఉంటుంది. ఆ తర్వాత అరటిపండ్లలో 14 గ్రాములు చక్కెర ఉంటుంది. అయితే ఈ పండ్లలో చక్కెర ఎక్కువగా ఉండటం వలన ఈ పండ్లను తినొచ్చు కానీ పరిమిత మోతాదులోనే తినాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications