నిద్రలో ఈ రకమైన కలలు వస్తున్నాయా.. బీ కేర్ ఫుల్ !

కలలు.. సాధారణంగా నిద్రపోయేటప్పుడు ప్రతి మనిషికి ఇవి వస్తుంటాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కలలు కంటారు. మనం రోజంతా ఏమి ఆలోచిస్తామో దానిపైనే మన కలలు ఆధారపడి ఉంటాయి. అయితే కొందరు కలలను గుర్తుంచుకుంటే.. మరికొందరు మర్చిపోతుంటారు. ఇంకొందరు మాత్రం కలని అటు పూర్తిగా మర్చిపోకుండా.. ఇటు పూర్తిగా గుర్తు పెట్టుకోకుండా సగం సగంగా ఉండిపోతుంటారు.

కలల్లో కొంతమందికి మంచి కలలు వస్తే మరి కొంతమందికి చెడు కలలు వస్తాయి. అయితే మనం రోజంతా ఏమి ఆలోచిస్తామో అది కూడా మన కలల్లోకి వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక నిర్ధిష్టమైన అర్థం ఉంటుందని.. కలలు ఎన్నో రకాలు ఉన్నట్లే వాటి అర్థాలు కూడా విభిన్నంగా ఉంటాయని పండితులు అంటుంటారు. ఇందుకు సంబంధించిన విషయాలు స్వప్న శాస్త్రంలో కూడా పొందుపరిచి ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.

these kinds of dreams come during sleep Be careful

కలలో మనం ఆలోచించే విషయాలు కనిపిస్తాయని చెబుతున్నప్పటికీ.. కొన్నిసార్లు మనం చూడని ప్రదేశాన్ని, స్థలాన్ని కూడా ఎందుకు చూస్తుంటాం అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి అప్పుడప్పుడు పీడకలలు వస్తాయి. అయితే కొంతమందికి ప్రతిరోజూ చెడు కలలు వస్తాయి. కొంతమంది అయితే ఏకంగా రాత్రిపూట చెడు కల కారణంగా అకస్మాత్తుగా మేల్కొంటూ ఉంటారు.

రెగ్యులర్ గా చెడు, భయానక కలలు పదే పదే వస్తుంటే.. మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు. శారీరక ఆరోగ్యంపై ఇది హాని చేస్తుందని.. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇలా తరచుగా వచ్చే పీడకలలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనే మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఈ తరహా లక్షణాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ గా భావించవచ్చని చెబుతున్నారు. అందుకే రోజూ చెడు కలలు వస్తూ ఉంటే ఒత్తిడికి దూరంగా ఉండాలని అంటున్నారు.

మరి ముఖ్యంగా చెడు కలలు రాకుండా ఉండాలంటే పగటిపూట నిద్రపోవడం మానుకోవాలని వెల్లడిస్తున్నారు. రాత్రి పడుకోవడానికి.. ఉదయం నిద్ర లేవడానికి ఒక సమయాన్ని నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత టీ, కాఫీ తాగడం కూడా మానేయ్యాలని వివరించారు. రాత్రిపూట వ్యాయామం చేయవద్దని తెలిపారు. అలానే రాత్రి భోజనంలో పాలు, అరటిపండు తీసుకోవాలంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+