నిద్ర లేవగానే ఈ పొరపాట్లు చేయకుండి - ఇక, రోజంతా హ్యాపీనే..!!

ప్రతీ ఒక్కరూ ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు. ఆ జోష్ రోజంతా టానిక్ లా పని చేస్తుంది. ఉదయం సమయంలో మనం చేసే పనులు శారీరకంగా.. మానసికంగా మన పైన ప్రభావం చూపిస్తాయి. కాగా, ఉదయ లేవగానే కొన్ని పొరపాట్లు చేయవద్దని నిపుణులు సూచనలు చేస్తున్నారు. వీటికి దూరంగా ఉంటే మంచి జీవనశైలి అలవడుతుంది. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు మేలు చేస్తుంది.

ఉదయం నిద్ర లేచే సమయంలో వెల్లకిలా పడుకొని అదే స్థితిలో లేచి కూర్చొంటారు. దీని కారణంగా కండరాల సమస్య తలెత్తే అవకాశం ఉంది. కుడిపక్కకు నెమ్మదిగా లేవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆపై కాస్త అటూ ఇటూ కదలడం వల్ల రాత్రంతా నిశ్చలంగా ఉన్న శరీర భాగాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. త్వరగానే నిద్ర లేచినా ఆఫీసు టైం వరకు ఏదో ఒక పని చేస్తూ ఆఖరి క్షణాల్లో కంగారుగా రెడీ అవుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడికి గురవతారని నిపుణులు చెబుతున్నారు. ముందు రోజు రాత్రి సమయంలోనే అన్నీ సిద్దం చేసుకొని ఉంటే నెక్స్ట్ డే ఉదయం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్ర లేవడానికి, పనులు తొందరగా ముగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టైం లేదంటూ కొందరు బ్రేక్ ఫాస్ట్ ను మానేసి జాబ్ కు వెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే దీని కారణంగా రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఒబెసిటీ, డయాబెటీస్ వంటి సమస్యలు తెచ్చి పెట్టే ప్రమాదం ఉంది.

these-mistakes-should-not-do-when-waking-up-early-in-the-morning

ఉదయం లేవగానే చాలా మంది ఫోన్లో వచ్చే నోటిఫికేషన్లు చెక్ చేసుకోవడం, చాటింగ్ చేయడం, కాల్స్ మాట్లాడడం. కొన్ని కాల్స్ తో ఉదయాన్నే మూడ్ ఆఫ్ అవుతుంది. దీంతో, అత్యవసర కాల్స్, మెసేజెస్​ చేసే పనుంటే తప్ప ఉదయం లేవగానే మొబైల్స్ జోలికి వెళ్లకపోవడం మంచిదని చెబుతున్నారు. ఉదయాన్నే చేసే వ్యాయామం రోజంతటికీ కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఒకేసారి ఎక్కువ బరువులెత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం వంటివి చేయొద్దని సూచిస్తున్నారు. అందుకు బదులు నెమ్మదిగా కదిలించే ప్రయత్నం చేయాలని, ఇందుకోసం వ్యాయామానికి ముందు కాసేపు వార్మప్ చేయడం, యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. దీంతో కండరాలు రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుందని, ఆపై అసలైన వ్యాయామ రోటీన్​ని పాటించేయచ్చని.. ఇలా ఈ చిన్న పొరపాట్లకు దూరంగా ఉంటే ప్రతీ రోజు ఆరోగ్యంగా.. ఆనందంగా గడిపేయచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+