కల్లు ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ: తెలంగాణ మాజీ ఎంపీ
Konda Vishweshwar Reddy: తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో భారత్ రాష్ట్ర సమితి తరఫున రాజకీయ అరంగేట్రం చేశారాయన. తొలి ప్రయత్నంలోనే బీఆర్ఎస్ తరఫున లోక్‌సభకు ఎంపికయ్యారు.
2014 నాటి ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో ఇదే చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి జీ రంజిత్ రెడ్డి చేతిలో 14,317 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

కాంగ్రెస్‌లోనూ ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారాయన. గత ఏడాది బీజేపీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈ సారి కూడా బీజేపీ తరఫున చేవెళ్ల నుంచే లోక్‌సభకు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజాగా ఆయన వార్తలోకి ఎక్కారు. తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు. రోజూ బ్రేక్ ఫాస్ట్‌లో తప్పనిసరిగా కల్లు తీసుకుంటానని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోకి ఉప్మా, చింతకాయల తొక్కు, రేగుపండ్లు తీసుకున్నానని తెలిపారు. దానితో ఓ గ్లాసెడు కల్లు తాగానని పేర్కొన్నారు.

కల్లు కోసం ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన, ఆల్కహాల్‌తో కూడిన ప్రో-బయోటిక్ డ్రింక్‌ని అభివృద్ధి చేశానని వివరించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రోజూ ఉదయాన్నే రేగుపండ్లతో పాటు కల్లు తీసుకోవడం ఆరోగ్యాన్ని, శరీరానికి కావాల్సిన ఎనర్జీ లభిస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications