ఈ ఆహారాలతో మంచి నిద్ర.. ట్రై చెయ్యండి

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు సరైన నిద్ర అవసరం. నిద్ర మన జీవితంలో కీలక భూమిక పోషిస్తుంది. ప్రతిరోజు 7 గంటల నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరంలో ఉండే అనేక సమస్యలను నిద్ర రిపేర్ చేస్తుంది.

నిద్ర లేమి ఈ ఆహారాలతో తగ్గుతుంది
అయితే చాలామంది నిద్రపోవడానికి తెగ కష్టపడుతూ ఉంటారు. సరిగ్గా నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అర్ధరాత్రి లేచి కూర్చుని నిద్ర పట్టడం లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు తమ డైట్ లో కొన్ని ఆహారాలను చేర్చుకుంటే హాయిగా నిద్ర పోతారు. మరి ఆ ఆహారాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం..

Try these foods for better sleep

ఇవి ఆహారంలో తీసుకుంటే నిద్ర సమస్య ఉండదు
మనం తీసుకునే ఆహారంలో బాదంపప్పు ఉండేలా చూసుకుంటే, బాదంపప్పు మన జ్ఞాపకశక్తిని మెరుగు పరచడంతో పాటు, నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. ఇక నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. విటమిన్-డి, ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల కూడా నిద్రలేమి సమస్య తగ్గుతుంది.

ఈ పండ్లతో హాయిగా నిద్ర పోతారు
అంతేకాదు మనం తీసుకునే ఆహారంలో పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కివి పండ్లు, చెర్రీస్, అరటి పండ్లు ఎక్కువగా తింటే హాయిగా నిద్ర పోతారని చెప్పొచ్చు. అరటిపండ్లలో క్యాల్షియం, మెగ్నీషియం రెండు అధికంగా ఉండటం వల్ల ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి, హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. వాల్నట్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా నిద్ర చక్రం మెరుగుపడుతుంది. ఇది హాయి అయిన నిద్రను మనకు ఇస్తుంది.

నిద్రకు బాగా పనికొచ్చే ఆహారాలివే
అంతేకాదు మనం తీసుకునే ఆహారంలో డార్క్ చాక్లెట్ కూడా నిద్రకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆహారంలో ఓట్స్ చేర్చుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. తేనెను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి నిద్ర వస్తుంది. పప్పులు ప్రోటీన్లకు అద్భుతమైన మూలకం కాబట్టి, మన ఆహారంలో పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు సుఖంగా నిద్ర పోవడానికి ఈ ఆహారాలను మీ భోజనంలో ఉండేలా చూసుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+