జస్ట్.. ఇవి తీసుకుంటే చాలు
మనం రోజూ తీసుకునే ఆహారంలో ఫైబర్ (పీచు) అత్యవసరం. జీర్ణ వ్యవస్థను సరిగ్గా పని చేయడంలో దీని పాత్ర ప్రధానం. నిజానికి- జీర్ణ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. ఏ మాత్రం తేడా కొట్టినా విరేచనాలు, లేదా మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రేగు కదలికలు, జీర్ణక్రియను మరింత క్రమబద్ధంగా చేస్తుంది.ఫైబర్ అధికంగా ఉండే ఆహారం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించగలదు. ముఖ్యంగా కరిగే ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది. ఇవి ఇతర ఆహారాలలో తినే చెడు కొలెస్ట్రాల్‌ను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది.

కరిగే ఫైబర్ జీర్ణ శయాంతర ప్రేగులలోని కొలెస్ట్రాల్, పిత్త ఆమ్లాలతో కలిసిపోతుంది. రక్తంలో చక్కెరను మెరుగుపరుస్తుంది. మనం తినే ఆహారంలో పీచు అధికంగా ఉండటం శరీరానికి అత్యవసరం. దీనివల్ల జీర్ణం బాగా జరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. బరువు, డయాబెటీస్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
గుండె ఆరోగ్యం సైతం ఈ పీచు పదార్థాల వల్ల ఎంతగానో మెరుగుపడుతుంది. గుండెకు ఓ మెడిసిన్, ఓ టానిక్ లా ఇది ఉపయోగపడుతుందని, మరింత శక్తిని ఇచ్చినట్టవుతుందని డాక్టర్లు చెబుతుంటారు. డయాబెటీస్, క్యాన్సర్ ప్రమాదాల శాతాన్ని కూడా ఈ పీచు పదార్థాలు గణనీయంగా తగ్గించగలవు.
- ఫైబర్ అధికంగా ఉండే గింజలు- విత్తనాల జాబితాలో చియా సీడ్స్ టాప్ లో ఉంటాయి. ఓ వంద గ్రాముల చియా సీడ్స్ లో 34 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. అలాగే ఫ్లాక్స్ సీడ్స్. ఇందులో 27 గ్రాముల వరకు పీచు మిళితమై ఉంటుంది. వంద గ్రాముల బాదంలో ఉండే పీచు.. 12 గ్రాములు.
- ఫైబర్ అధికంగా ఉండే ధాన్యాల జాబితాలో గోధుమ బ్రాన్ లో పీచు అధికంగా ఉంటుంది. 100 గ్రాముల గోధుమ బ్రాన్ లో పీచు 43 గ్రాముల వరకు ఉంటుంది. ఓట్స్- 10 గ్రాములు, మిల్లెట్లు (సజ్జలు-కొర్రలు), బ్రౌన్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
- పండ్ల విషయాలకు వస్తే.. జామలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. అయిదు గ్రాముల వరకు పీచు ఇందులో ఉంటుంది. ఆపిల్ లో 4 గ్రాముల వరకు పీచు ఉంటుంది. నారింజ, అరటి, సీతాఫలం పండ్లల్లోనూ పీచు ఎక్కువ మోతాదులో ఉంటుంది.
- కూరగాయల్లో.. క్యారెట్, బెండకాయ, గుమ్మడికాయ, పొట్లకాయ, క్యాబేజీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
-
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
రెస్టారెంట్ స్టైల్ "జీడిపప్పు చికెన్ పకోడీ" ఇలా చేస్తే అదరహో !! -
"గుత్తి వంకాయ కారం" టేస్టే వేరబ్బా.. ఎప్పుడైనా ట్రై చేశారా..? -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు.. -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications