యువతలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న యూరిక్ యాసిడ్ సమస్య.. కింకర్తవ్యమిదే!
భారతదేశంలో యువత ఇప్పుడు ఒక ప్రధానమైన అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. యువతలో యూరిక్ యాసిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. యువతలో యూరిక్ యాసిడ్ సమస్య పెరగడం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతుంది. ఈ సమస్య మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామ లోపం వంటి కారణాలతో వస్తుంది.
యువతలో యూరిక్ యాసిడ్ సమస్యలు
ప్రస్తుతం మారుతున్న జీవన శైలిలో యువత శారీరకంగా పెద్దగా పని చేయటం మానేశారు. ఎవరు ఏ పని చేసినా మైండ్ తో చేసే పనే తప్పా శరీర పరంగా పెద్దగా కష్టపడే పనే లేకుండా పోయింది. ఫలితంగా అనారోగ్యం యూరిక్ యాసిడ్ రూపంలో పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య కారణంగా గౌట్, ఆర్థరైటిస్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

యూరిక్ యాసిడ్ సమస్యలతో ఈ వ్యాధులు
ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ముందుగా యూరిక్ యాసిడ్ సమస్యలు రావడానికి గల కారణాల పైన అవగాహన పెంచుకోవడం, నిరోధక చర్యలు తీసుకోవడం అవసరమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. శరీరంలో అధికంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం మూత్రపిండాల వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని, గౌట్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు కారణమవుతుందని, ఫలితంగా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని, ఇది మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ కారణాలతోనే యూరిక్ యాసిడ్ సమస్య
మన ఆహారపు అలవాట్లు, మన జీవనశైలి ముఖ్యంగా దీనికి కారణమని సూచిస్తున్నారు. విపరీతంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్స్ తినడం, ఎక్కువగా కూల్ డ్రింక్స్ త్రాగడం, రెడ్ మీట్ తినడం వంటి చెడు ఆహారపు అలవాట్లు యూరిక్ స్థాయిలను పెంచుతాయని చెబుతున్నారు. కొంచెం కూడా వ్యాయామం లేని, కదలని మెదలైన జీవన శైలి మన సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించటానికి ఇలా చెయ్యండి
సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. మన శరీరానికి కావలసినంత వాటర్ ను తీసుకోవడం, మంచి ఆహారపు అలవాట్లను చేసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు . ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం ద్వారా చిన్న వయసు నుండి వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అని సూచిస్తున్నారు.
-
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!! -
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications