ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పుల్లగా, కారంగా అదిరిపోయేలా ఇలా చెయ్యండి!

మనం తినే ఆహారంలో పచ్చళ్ళకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి పచ్చళ్ళలో ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యానికి మంచిది కాకుండా రుచిలో కూడా బాగుంటుంది. కానీ చాలామంది ఉసిరి ముక్కలు వగరుగా ఉంటాయని పక్కన పెడతారు. సరిగ్గా చేస్తే ఆ ముక్కలు కూడా ఆవకాయ ముక్కల్లా మెత్తగా, రుచిగా మారతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

ముందుగా అర కేజీ ఉసిరికాయలు తీసుకోండి. మీడియం సైజు, దెబ్బలు లేని, కుళ్లని కాయలు ఎంచుకోండి. బాగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టండి. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. స్టవ్ మీద నీళ్లు మరగనివ్వండి. చిల్లుల ప్లేటు పెట్టి దాని మీద ఉసిరికాయలు పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఆవిరిపై ఉడికించండి.

usirikaya nilva pachadi Know how to make long-lasting Usirikaya pickle with Avakaya-style taste

చల్లారిన తర్వాత చేత్తోనే ముక్కలు విడదీయవచ్చు. కత్తి అవసరం లేదు. ముక్కలను ప్లేట్‌లో పరచి ఫ్యాన్ కింద లేదా ఎండలో ఒక గంట ఆరబెట్టండి. ఎక్కువసేపు ఆరబెడితే నిల్వ కాలం పెరుగుతుంది. ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మెంతులు వేసి సన్నని సెగ మీద దోరగా వేయించి, చల్లార్చి పొడి చేసుకోండి.

అదే పాన్‌లో ఒక కప్పు వేరుశనగ నూనె వేడి చేసి, ఆరిన ఉసిరి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లో లేత గోధుమ రంగు వచ్చేలా వేయించండి. ఇలా వేయించడం వల్ల వగరు తగ్గి మెత్తగా ఉంటాయి. వేయించిన నూనెలోనే తాలింపు వేయండి. ఒక టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, కొన్ని ఎండు మిర్చి వేసి వేయించి, స్టవ్ ఆపేసి కరివేపాకు, పసుపు, ఇంగువ, తొక్క తీసిన వెల్లుల్లి వేసి కలపండి. పూర్తిగా చల్లారనివ్వండి.

పుల్ల కంద, కోడిగుడ్ల పులుసు.. ఇలా చేస్తే లొట్టలేసి తింటారు!
పుల్ల కంద, కోడిగుడ్ల పులుసు.. ఇలా చేస్తే లొట్టలేసి తింటారు!

చల్లారిన ఉసిరి ముక్కల్లో ఆవాలు-మెంతుల పొడి, అర కప్పు కల్లు ఉప్పు, అర కప్పు కారం వేసి కలపండి. తర్వాత చల్లారిన తాలింపు నూనె పోసి మళ్లీ కలపండి. చివర్లో పావు కప్పు నిమ్మరసం వేసి కలపాలి. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేయకూడదు. రెండు మూడు రోజులు ఊరనివ్వండి. నూనె సరిపోకపోతే కొద్దిగా వేడి చేసి చల్లార్చిన నూనె కలపవచ్చు. ఇలా చేస్తే ఆవకాయ రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి సిద్ధం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+