వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
నడక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శారీరక వ్యాయామంలో సులభమైనది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వేళ నడక విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదవుతున్నాయి. దీంతో.. వేసవి లో వాకింగ్ చేయాల్సిన సమయంతో పాటుగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల పైన నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఎండ తీవ్రత పెరిగే వరకు మధ్య వయసు దాటిన వారు నడక చేయటం మంచిది కాదని సూచిస్తున్నారు. అదే సమయంలో నిత్యం ఇన్ని అడుగులు వేయాలనే లక్ష్యానికి పరిస్థితులకు అనుగుణంగా సడలింపు ఇవ్వాలని చెబుతున్నారు.
వేసవిలో నడక పూర్తగా మానేయాల్సిన అవసరం లేదు. అలా చేయటం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అయితే, వేసవిలో ఉదయం 5 గంటల నుండి 7 గంటల మధ్య లేదా ఈవినింగ్ 6 నుండి 8 గంటల మధ్య నడవడం ఉత్తమ సమయం అని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, హీట్‌స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఉదయం గాలి తాజాగా ఉండి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నడవడం ప్రమాదకరమని, ఎందుకంటే ఈ సమయంలో UV కిరణాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నడక మొదలు పెట్టిన వారు మొదట రోజుకు 20 నుండి 30 నిమిషాలు నడవడం ప్రారంభించి, క్రమంగా 30 నుండి 60 నిమిషాలకు పెంచుకోవాలి. అవసరమైతే ఉదయం, సాయంత్రం చిన్న సెషన్లుగా విభజించి నడవవచ్చని సూచిస్తున్నారు. ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు నడవడం కూడా మంచి పద్ధతిగా చెబుతున్నారు. నడకకు ముందుగా, నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. నడకకు ముందు, మధ్యలో, తర్వాత నీటిని ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.

వేసవిలో వాకింగ్ వేళ జాగ్రత్తలు
అదే విధంగా ఎలక్ట్రోలైట్ పానీయాలను కూడా తీసుకోవచ్చు. అలాగే డీహైడ్రేషన్‌ను పెంచే కాఫీ, మద్యం వంటి పానీయాలను తగ్గించడం మంచిది. అదే విధంగా సూర్యరశ్మి నుండి శరీరాన్ని రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. నడకకు వెళ్లినప్పుడు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ శాతం కెపాసిటీ గల సన్‌స్క్రీన్ ఉపయోగించడం, టోపీ, సన్‌గ్లాసెస్ ధరించడం వంటివి చేయాలి. అలాగే శరీరానికి గాలి సులభంగా తగిలేలా తేలికపాటి దుస్తులు ధరించడం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. చెట్లు ఉన్న ప్రదేశాల్లో లేదా పార్కుల్లో నడవడం వల్ల నీడలో ఉండి సౌకర్యంగా నడవవచ్చు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వడదెబ్బ లక్షణాలను గుర్తించడం కూడా చాలా ముఖ్యం. తలనొప్పి, వాంతులు, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నడక ఆపి విశ్రాంతి తీసుకోవాలి. చిన్న స్థాయి డీహైడ్రేషన్ కూడా అలసటను పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదే అయినప్పటికీ వేసవిలో మాత్రం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ.. సరైన సమయంలో వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
-
గ్రీన్ టీ Vs బ్లాక్ టీ: రెండింటి లో ఏది మంచిది, పరిమితి..!! -
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
భగవంతుడా.. కూతురు శవంతోనే ఐదు నెలలు పాటు తండ్రి.. ఏం చేశాడంటే ?? -
గరం గరం పాయా సూప్ తీసుకోండి చాలు- ఏ పుత్తూరు కట్టూ అవసరం లేదు -
సండే స్పెషల్ "కడక్‌నాథ్ కోడి మాంసం".. నాటు కోడి కంటే బెస్ట్ టేస్ట్ ? -
మజ్జిగలో ఇవి కలిపితే అమృతమే -
వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే "వెజిటెబుల్ మజ్జిగ పులుసు" ట్రై చేస్తారా..? -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!












Click it and Unblock the Notifications