రాత్రి భోజనం చేశాక కాసేపు న‌డిస్తే..ఈ సమస్యలున్న వారికి బిగ్ రిలీఫ్..!!

వాకింగ్. ఎవరికైనా ఆరోగ్యాన్ని అందించే వ్యాయామం. ఏ వయసు వారైనా వాకింగ్ చేయటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనాలు అందుకోవచ్చు. ఉదయం సమయంలో ఎక్కువ మంది వాకింగ్ కు వెళ్తారు, అయితే, రాత్రి భోజనం తర్వాత స్వల్పంగా నడవడం జీర్ణక్రియకు చాలా కాలంగా సూచిస్తున్న సరళమైన అలవాట్లలో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. ఈ నడక మధుమేహ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. పలు రకాల సమస్యలకు ఈ తరహా నడక ప్రయోజనకరమని వైద్యులు పేర్కొంటున్నారు.

రాత్రి పూట భోజనం తరువాత కాసేపు నడక ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నడక కేవలం ఆహారం జీర్ణం కావడానికే కాదు, కడుపులో గ్యాస్, ఉబ్బరం తగ్గించడంలో, మలబద్ధకం తగ్గించడంలో, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. జీర్ణాశయ ఆరోగ్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన తర్వాత 5 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. ఇంటి చుట్టూ, ఆఫీస్‌లో, ట్రెడ్‌మిల్‌పై లేదా బయట వీధిలో నెమ్మదిగా నడిచినా సరిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కఠినమైన వ్యాయామం చేయకుండా సాదాసీదా నడక మాత్రమే చేయాలని సూచన చేస్తున్నారు. భోజనం తర్వాత నడక వల్ల ఆహారం పేగుల్లో సులభంగా కదలడంలో సహాయం జరుగుతుంది.

నిర్ణయం మార్చుకున్న లారెన్స్, విజయ్ ప్రతిపాదన తో..!!
నిర్ణయం మార్చుకున్న లారెన్స్, విజయ్ ప్రతిపాదన తో..!!
walking-for-10-to-30-minutes-after-meals-may-help-manage-blood-sugar-levels-improve-digestion-and

ఆరోగ్య పరమైన ప్రయోజనాలు

ఇలా నడవటం వలన కడుపులోని గ్యాస్ బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండి ఉబ్బరం తగ్గుతుంది. అలాగే పేగుల కదలికలు మెరుగుపడి మల విసర్జన సులభమవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారికి కూడా ఈ అలవాటు కొంత ఉపశమనం ఇస్తుంది. భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కూర్చోవడం కంటే కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అసౌకర్యం తగ్గుతుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారికి భోజనం తర్వాత చిన్న నడక శరీరానికి చలనం కలిగించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫార్ట్ వాక్స్ చేయాలంటే ముందుగా భోజనం పూర్తి చేసిన తర్వాత కొద్దిసేపు ఆగాలి. ఆ తర్వాత నెమ్మదిగా, ఒత్తిడి లేకుండా నడవాలి. వేగంగా పరుగులు తీయడం లేదా గట్టిగా వ్యాయామం చేయడం మంచిది కాదు. రోజూ రాత్రి భోజనం తర్వాత ఇలా కొద్దిసేపు నడిస్తే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. సాధారణంగా కనిపించే ఈ అలవాటు దీర్ఘకాలంలో మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలు, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు తరచూ ఎదురయ్యే వారు ఈ వాకింగ్ అలవాటు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+