రెగ్యులర్ గా వాకింగ్ చేస్తున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. వ్యాయామం చేయలేకపోయినా, పరుగెత్తకపోయినా కొన్ని నిమిషాలు నడిస్తే చాలు. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నడకకు ఎక్కువ శ్రమ లేదా సమయం అవసరం లేదు. నడక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీర జీవక్రియను సరి చేస్తుంది. అయితే, రెగ్యులర్ గా వాకింగ్ చేసే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఇబ్బందులు గుర్తించిన సమయం లో మాత్రం అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్నారు.
నడక ప్రతీ రోజు 30 నిమిషాలు చేయటం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయి. ఈ రెగ్యులర్ వాకింగ్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బరువు నియంత్రణకు సహాయపడు తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ చేయడం చాలా ముఖ్యం. అయితే.. రోజుకు ఎంత సేపు నడవాలి.. ఎంత దూరం నడవాలి అనే అంశాల పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిపుణులు మాత్రం ఎవరు ఎంత దూరం నడవాల నేది వారి ఫిట్‌నెస్ స్థాయి, ఆరోగ్య పరిస్థితి, వయస్సుపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా రోజుకు 7,000 నుండి 8,000 అడుగులు నడవడం లేదా 8 కిలోమీటర్లు నడవడం ప్రభావ వంతంగా ఉంటుంది. 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవడం సాధ్యమే, కానీ ఎక్కువ నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభించవని స్పష్టం చేస్తున్నారు.

వాకింగ్ వేళ ఈ జాగ్రత్తలు అవసరం
అయితే, నడక సమయంలో ఎవరికైనా మోకాలి లేదా వెన్నెముక సమస్యలు ఉంటే, అధికంగా నడవడం ప్రమాదకరం కావచ్చుని అప్రమత్తం చేస్తున్నారు. అలాంటి సందర్భాలలో, మీరు వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. మీరు రోజూ ఎంత వాకింగ్ చేసినా అది ఆరోగ్యకరం గా పేర్కొంటున్నారు. క్రమం తప్పకుండా నడవడం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. తీవ్రమైన అనారోగ్యాల నుండి రక్షిస్తుంది. రెగ్యులర్ గా వాకింగ్ చేసే వారు పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు. అధిక బరువుతో ఉంటే, బరువును నియంత్రణలో ఉంచడానికి తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలని... క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని చెబుతున్నారు. పుష్కలంగా నీరు తాగాలని.. కండరాలను గాయం నుండి రక్షించుకోవడానికి నడవడానికి ముందు కొంచెం లైట్ స్ట్రెచింగ్ చేయటం అవసరమని సూచిస్తున్నారు. కండరాలు లేదా కీళ్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే, వైద్యుడిని సంప్రదించటం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications