చికెన్ ప్రియులకు హెచ్చరిక.. చికెన్ లో ఈ భాగాలు అసలే తినొద్దు!

చికెన్ చాలామంది మాంసాహార ప్రియులకు ఇష్టమైన ఆహారం. తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ లభించే ఆహారం కాబట్టి దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. అయితే, కోడి మాంసం తినేవాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు ఉంచుకోవాలి. రుచి కోసం కోడిలోని అన్ని భాగాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోడి మాంసంలో ఈ భాగాలలో ప్రమాదకర బ్యాక్టీరియా

కోడి శరీరంలో కొన్ని భాగాలు వ్యర్థాలను వడపోసే పని చేస్తాయి. దీంతో ఆ భాగాల్లో విష రసాయనాలు, హార్మోన్ల అవశేషాలు మరియు ప్రమాదకర బ్యాక్టీరియా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఉడికించకపోతే లేదా అధికంగా తింటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Warning for Chicken Lovers Not all parts of chicken are safe to eat Know harmful parts of chicken

చికెన్ లో ఈ భాగాలు మంచివి కావు

చాలా మంది చికెన్ చర్మాన్ని ఇష్టపడతారు. కానీ ఇందులో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. స్కిన్ చికెన్ కంటే స్కిన్ లెస్ చికెన్ తినడం మంచిది. కోడి తోక భాగంలో కూడా చెడు చేసే గ్రంధులు మరియు కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి హానికరం. ఇందులో బ్యాక్టీరియా నిల్వ ఉండే అవకాశం కూడా ఎక్కువ కనుక ఈ భాగాన్ని తినొద్దు.

ఊపిరితిత్తులు, పేగులు చాలా డేంజర్

కోడి ఊపిరితిత్తుల్లో అనేక రకాల బ్యాక్టీరియా మరియు పరాన్నజీవులు ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలో వండినా కొన్ని బ్యాక్టీరియాలు చనిపోవు. ఇవి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ఇక కోడి పేగులను కూడా తినకూడదు. పేగులు ఎల్లప్పుడూ వ్యర్థాలు, పరాన్నజీవులు మరియు బ్యాక్టీరియాతో నిండి ఉంటాయి. సరిగ్గా శుభ్రం చేసి ఉడికించకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఎక్కువ.

కాళ్లు, తల, మెడలోనూ టాక్సిన్స్

కోడి కాళ్లు నేలపై ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా సోకే అవకాశం ఎక్కువ.ఐ వి కూడా తినకుండా ఉంటే మంచిది కానీ ఒకవేళ తినాలి అనుకుంటే జాగ్రత్తగా శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించాలి. కోడి తలలో హార్మోన్లు, యాంటీబయాటిక్స్ అవశేషాలు మరియు టాక్సిన్స్ ఉంటాయి. ఇది దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి హాని చేయవచ్చు. కోడి మెడ భాగంలో శోషరస కణుపులు ఉండటం వల్ల వైరస్‌లు మరియు టాక్సిన్స్ సులభంగా నిల్వ ఉంటాయి. అందుక వీటిని అధికంగా తినకూడదు.

కాలేయం, మూత్రపిండాలు

కాలేయం శరీరంలోని విషాలను వడపోసే అవయవం కాబట్టి ఇందులో హార్మోన్లు మరియు యాంటీబయాటిక్ అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. పరిమితంగా మాత్రమే తినాలి. మూత్రపిండాల్లో కూడా విష పదార్థాలు మరియు ఔషధ అవశేషాలు పేరుకుపోయే అవకాశం ఉంది. కనుక ఎక్కువగా వీటిని తినకూడదు.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త .. 60 కొత్త కోచ్‌ లు!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త .. 60 కొత్త కోచ్‌ లు!

రక్త నాళాలు మరియు అపరిశుభ్ర భాగాలు

వండేటప్పుడు రక్తం, రక్తనాళాలు పూర్తిగా తీసివేసి, మాంసాన్ని బాగా ఉడికించి తినాలి.చికెన్ పౌష్టికమైన ఆహారం అయినా, తినేటప్పుడు మంచి శరీరభాగాలను ఎంచుకోవటం మంచిది. చర్మం లేని ఛాతీ మాంసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక కోడి మాంసం తినాలంటే సరైన శుభ్రత పాటించాలి. పూర్తి ఉడికించటం ద్వారా ఫుడ్ పాయిజన్ ప్రమాదాన్ని నివారించవచ్చు.

disclaimer: ఈ కథనం ఆహార నిపుణుల నుండి సేకరించిన సమాచారం మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+