పుచ్చకాయ రైస్ అసలు ఎప్పుడైనా ట్రై చేశారా..?

వేసవి కాలంలో ప్రకృతి మనకు ప్రసాదించిన అమృత ఫలం పుచ్చకాయ. సుమారు 92% నీటి శాతాన్ని కలిగి ఉండి.. ఎండ వేడిమి నుండి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. ఇందులో విటమిన్-A, విటమిన్-C మరియు పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాగా రక్తపోటును నియంత్రించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమమైన ఆహారం. కేవలం పండుగానే కాకుండా, జ్యూస్‌లు, సలాడ్ల రూపంలో కూడా దీనిని ఆస్వాదించవచ్చు.

అంతే కాకుండా పుచ్చకాయ రైస్ అనేది వేసవిలో ట్రై చేయదగిన ఒక ప్రత్యేకమైన, రిఫ్రెషింగ్ వంటకం. రొటీన్ భోజనానికి భిన్నంగా, ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ రెసిపీని ఒకసారి తప్పక ట్రై చేయాలని అంటుంటారు. పుచ్చకాయ రసంతో బాస్మతీ బియ్యాన్ని వండి, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్.. గింజల తాలింపుతో (పొద్దుతిరుగుడు లేదా పుచ్చకాయ గింజలు) దీనిని తయారు చేస్తారు. ఈ టేస్టీ రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

watermelon-rice-making-recipe-in-telugu-with-easy-steps-and-tips-for-serving-also-better-taste

కావలసిన పదార్థాలు..

  • బాస్మతి బియ్యం - 1 కప్పు
  • పుచ్చకాయ ముక్కలు - 3 కప్పులు (జ్యూస్ కోసం)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
  • గరం మసాలా - ½ టీస్పూన్
  • నూనె - 2 టీస్పూన్లు
  • నల్ల జీలకర్ర (కలోంజి) - ½ టీస్పూన్
  • పుచ్చకాయ గింజలు / పొద్దుతిరుగుడు గింజలు - 1 టేబుల్ స్పూన్
  • నువ్వులు - 1 టీస్పూన్
  • కొత్తిమీర - తరిగింది

జ్యూస్ తయారీ విధానం..

ముందుగా పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వడకట్టి గింజలు లేకుండా జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి సుమారు 2.5-3 కప్పుల పుచ్చకాయ జ్యూస్ అవసరం.

అన్నం వండే విధానం..

కడిగిన బియ్యాన్ని ఒక పాత్రలో వేసి, అందులో పుచ్చకాయ జ్యూస్ పోయాలి. తరువాత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా వేసి బాగా కలపాలి.

మూత పెట్టి మెల్లగా ఉడికించాలి. అన్నం పొడిపొడిగా అయ్యే వరకు కుక్ చేయాలి.

తాలింపు విధానం..

ఒక పాన్‌లో నూనె వేడి చేసి, అందులో నల్ల జీలకర్ర వేసి వేయించాలి.

తర్వాత పుచ్చకాయ గింజలు లేదా పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు వేసి కరకరలాడే వరకు వేయించాలి.

ఈ తాలింపును ఉడికిన అన్నంలో కలపాలి.

అలంకరణ & సర్వింగ్..

చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

అదనపు చిట్కాలు..

కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే రుచిలో తేలికపాటి పులుపు వస్తుంది

గ్రీన్ చిల్లీస్ లేదా మిరియాల పొడి వేసి కారం పెంచుకోవచ్చు

కాజూ, బాదం వంటి డ్రైఫ్రూట్స్ వేసుకుంటే రిచ్ టేస్ట్ వస్తుంది

పుదీనా ఆకులు వేసుకుంటే ఫ్రెష్ ఫ్లేవర్ పెరుగుతుంది

జాగ్రత్తలు..

ఆయుర్వేదం ప్రకారం పుచ్చకాయను ఇతర ఆహారాలతో కలిపి తినడం కొందరికి అజీర్ణం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+