రోజూ గోరు వెచ్చని నీళ్లను తాగుతున్నారా - ఇది తెలుసుకోవాలి...!!
శరీరానికి నీరు ఎంతో మేలు చేస్తుంది. అందునా గోరు వెచ్చని నీరు శరీరంలో జీవక్రియల పని తీరును మెరుగు చేస్తుంది. చాలా మంది ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీరు తీసుకోవటం అలవాటు. ఆయుర్వేదం ప్రకారం రోజూ మనం గోరు వెచ్చని నీళ్లను తాగటం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో ఎంజైమ్‌ల ఉత్పత్తి సక్రమంగా కొనసాగుతుంది. దీంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.
గోరు వెచ్చని నీళ్లను ఉదయం పరగడుపునే తాగితే సహజసిద్ధమైన క్లీన్సర్‌లా పనిచేస్తాయి. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు పోతాయి. కిడ్నీలు సైతం శుభ్రంగా మారుతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలోని అవయవాలు శుభ్రంగా మారి మెరుగ్గా పనిచేస్తాయి. గోరు వెచ్చని నీళ్లను తాగితే పేగుల్లో మలం కదలికలు సులభతరం అవుతాయి. దీంతో మలబద్దకం తగ్గిపోతుంది. గోరు వెచ్చని నీటి వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది.

గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గోరు వెచ్చని నీళ్లను తాగితే మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. తలలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లను సేవించడం గొంతు నొప్పి, గొంతులో మంట, గరగర వంటి సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీళ్లను తాగుతుండాలి. దీంతో ఎంతో ఉపశమనం లభిస్తుంది.












Click it and Unblock the Notifications