ఈ ఫుడ్స్‌ తింటే.. థైరాయిడ్‌ కంట్రోల్‌లో, వీటిని మాత్రం అసలు తొనొద్దు..!!

థైరాయిడ్. ప్రస్తుత కాలంలో అధిక శాత మందిని ఇబ్బంది పెడుతోంది. చిన్నారులు సైతం థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో పోష‌కాహార లోపం, వంశ పారంప‌ర్య‌త ఇందుకు ప్ర‌ధాన కార‌ణాలు. అయితే థైరాయిడ్‌లో రెండు ర‌కాలు ఉంటాయి. హైపో, హైప‌ర్ థైరాయిడిజం అని రెండు ర‌కాల థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉంటాయి. వీటిల్లో ఏది ఉన్నా స‌రే డాక్ట‌ర్ సూచించిన మేర‌కు మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే థైరాయిడ్ ఉన్న‌వారు కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్ర‌మే తినాల్సి ఉంటుంది. కొన్ని ర‌కాల ఆహారాల‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

థైరాయిడ్ ఉన్న‌వారు అయోడిన్ ఉండే ఆహారాల‌ను తినాల్సి ఉంటుంది. అలా అని చెప్పి అయోడైజ్డ్ సాల్ట్‌ను అధికంగా తిన‌కూడ‌దు. ఉప్పును మోతాదులోనే తినాలి. కోడిగుడ్లు, పెరుగు, చేప‌లు వంటి ఆహారాల‌ను తింటే మేలు జ‌రుగుతుంది. వీరు సెలీనియం ఉన్న ఆహారాల‌ను తింటుంటే ఉప‌యోగం ఉంటుంది. బ్రెజిల్ న‌ట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. రోజుకు 2 బ్రెజిల్ న‌ట్స్‌ను తింటున్నా ఉప‌యోగం ఉంటుంది. కోడిగుడ్లు, పొద్దు తిరుగుడు విత్త‌నాల్లోనూ సెలీనియం అధికంగా ఉంటుంది. అలాగే జింక్ ఎక్కువ‌గా ఉండే మ‌ట‌న్‌, చికెన్‌, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, శ‌న‌గ‌లు, జీడిప‌ప్పు, పెరుగును తింటే మేలు జ‌రుగుతుంది. థైరాయిడ్ ఉన్న‌వారు బ్రోక‌లీ, కాలిఫ్ల‌వ‌ర్‌, క్యాబేజీ వంటి కూర‌గాయ‌ల‌కు దూరంగా ఉండాలి. లేదంటే స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌వుతుంది. ఫైబ‌ర్ అధికంగా ఉండే తృణ ధాన్యాలు, పండ్లు, ఇత‌ర కూర‌గాయ‌లు, ప‌ప్పు దినుసుల‌ను తిన‌వ‌చ్చు.

what-s-the-best-diet-for-hypothyroidism-here-the-suggestions

అదే విధంగా ఆలివ్ ఆయిల్‌, అవ‌కాడోలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేప‌లు, అవిసె గింజ‌లు, వాల్ న‌ట్స్‌ను తింటున్నా ఉప‌యోగం ఉంటుంది. సోయా ఉత్ప‌త్తులైన టోఫు, సోయా పాల‌కు దూరంగా ఉండాలి. థైరాయిడ్ ఉన్న‌వారు సోయా ఉత్ప‌త్తుల‌ను అస‌లు తీసుకోకూడ‌దు. అవి థైరాయిడ్ మందుల ప‌నితీరుకు ఆటంకం క‌లిగిస్తాయి. కేవ‌లం అయోడిన్ ఉన్న ఉప్పునే తినాల్సి ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉంటే కోడిగుడ్డు లోప‌లి సొన తీసేసి కేవ‌లం తెల్ల సొన‌ను తిన‌వ‌చ్చు. అలాగే నారింజ పండ్ల‌ను తింటుండాలి. థైరాయిడ్ ఉన్న‌వారికి ఇవి మేలు చేస్తాయి. ఐర‌న్ అధికంగా ఉండే పాల‌కూర‌ను, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు క‌లిగిన ప‌సుపును కూడా తీసుకోవాలి. టీ, కాఫీ, సోడా, చాకొలెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బ‌ల్ టీల‌ను సేవించ‌వ‌చ్చు. థైరాయిడ్ ఉన్న‌వారికి కొంద‌రికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది. అలాంటి వారు గోధుమ పిండి తిన‌కూడ‌దు. చిరు ధాన్యాల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌చ్చు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+