చియా సీడ్స్ తింటున్నారా - అయితే, ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!!
చియా సీడ్స్. ఫైబర్‌తో సహా అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండే విత్తనం. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చియా విత్తనాల వినియోగం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. అనేక మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం చియా విత్తనాలన తీసుకుంటున్నారు. అయితే.. చియా విత్తనాల తో ఎన్ని రకాలుగా మేలు జరుగుతుందో.. అదే సమయంలో తీసుకోవాల్సిన పరిమితి గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు చియా ఎంత తీసుకోవాలి... ఏ విధంగా తినాలో సూచనలు చేస్తున్నారు.
చియా సీడ్స్ సూపర్‌ఫుడ్ స్టార్‌లా మారాయి. ఈ విత్తనాలను సాల్వియా హిస్పానియా అనే మొక్క నుండి తీసుకుంటారు. వీటిని చాలా మంది రాత్రిపుట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటారు. కానీ, వీటిని పాలలో నానబెట్టి తింటే రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతు న్నారు. నానబెట్టిన తర్వాత తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. చియా గింజలు తిన్న తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. ఎందుకంటే ఇది నీటిని గ్రహిస్తుంది. ఇది శరీరంలో నిర్జలీకరణానికి కారణమవుతుంది. మీరు మొదటిసారి చియా విత్తనాలను తింటుంటే తక్కువ పరిమాణంలో తినడం మీ ఆరోగ్యానికి మంచిది. ఒక రోజులో 1 నుండి 2 చెంచాల చియా గింజలు మాత్రమే తీసుకోవాలి. చియా విత్తనాలు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఇది కడుపుని ఎక్కువసేపు చల్లగా ఉంచుతాయి. అంతేకాకుండా, హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడంలో కూడా ఉపయోగపడతాయి.

చియా సీడ్స్ ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇది మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చియా సీడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతాయి. ఈ విత్తనాలు డయాబెటిక్ డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతాయి . చియా గింజలు కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా మనకు త్వరగా ఆకలి వేయదు. అతిగా తినకుండా నిరోధిస్తూ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. చియా గింజలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతాయి. చియా విత్తనాలను పెద్ద మొత్తంలో తినడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. చియా విత్తనాలంటే అలెర్జీ ఉన్నవారు వీటిని తినకూడదు.
ఇక, రక్తపోటు, మధుమేహ రోగులు వైద్యుడిని సంప్రదించకుండా చియా విత్తనాలను తినడం మంచిది కాదు. చియా విత్తనాలను నీటిలో లేదా పాలలో నానబెట్టకుండా తింటే గొంతు సమస్యలు వస్తాయి. బ్లడ్ ప్రెషర్ మందులు వాడేవాళ్లు ఎక్కువ తింటే పొటాషియం లెవెల్ ఒక్కసారిగా పెరిగి హైపర్‌కలీమియా వచ్చే రిస్క్ ఉంటుంది. ఒమేగా-3 ఎక్కువగా ఉండటంతో బ్లడ్ థిన్నర్స్ అయిన వార్ఫరిన్, ఆస్పిరిన్ వాడేవాళ్లకి బ్లీడింగ్ రిస్క్ పెరుగుతుంది. పెద్దలు రోజుకి 1-2 టేబుల్ స్పూన్లు (15-25 గ్రాములు) మాత్రమే తీసుకుంటే మంచిదని నిపుణుల సూచిస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications