వైద్య కళాశాల ఆస్పత్రి భోజనంలో చచ్చిన పాము

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడి కోసం క్యాంటిన్‌లో క్యాంటిన్ నుంచి ఓ మహిళ గ్రీన్ పీస్ కర్రీ పట్టుకుని వచ్చింది. దాంట్లో పాము చచ్చిపోయి కనిపించింది. ప్యాకెట్‌ను తెరిచిన మహిళ పామును చూసి ఒక్కసారిగా దిమ్మెరపోయింది. ఈ విషయాన్ని మహిళ ఆస్పత్రి అధికారులకు చెప్పింది. విషయం బయటకు పొక్కడంతో ప్రజలు ఆందోళనకు దిగారు.
పోలీసులు, ఆహార భద్రతా సంస్థ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్యాంటిన్ మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఆహార పదార్థాల నమూనాలను తీసుకుని వెళ్లారు. తదుపరి చర్యల కోసం వాటిని పరీక్షలకు పంపించారు.












Click it and Unblock the Notifications