Jantar Mantar Season 2: "జంతర్ మంతర్ సీజన్ 2" ఎప్పుడో చెప్పిన అభిజీత్ దిప్కే..!

నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళనలు దేశవ్యాప్తంగా బీజేపీపై ఒత్తిడి పెంచాయి. వీటి ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ తన పదవి వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఆందోళనలు సక్సెస్ అయ్యాక సీజేపీ నెక్ట్స్ ప్లాన్ ఏంటన్న దానిపై దేశవ్యాప్తంగా యువతలో ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో జంతర్ మంతర్ సీజన్ 2 (Jantar Mantar Season 2)ఎప్పుడంటూ ఇన్ స్టాలో సీజేపీ నేతలకు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

Cockroach Janta Party: కాక్రోచ్ పార్టీ నెక్స్ట్ ఉద్యమం ఇదే-అజెండా ప్రకటన..!
Cockroach Janta Party: కాక్రోచ్ పార్టీ నెక్స్ట్ ఉద్యమం ఇదే-అజెండా ప్రకటన..!

దీనికి ఇవాళ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే సమాధానం ఇచ్చారు. జంతర్-మంతర్ సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందని చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారని, వారికి తాను చెప్పేది ఏమిటంటే.. జంతర్-మంతర్' సీజన్ 2 చాలా త్వరలో ప్రారంభం కాబోతోంది అన్నారు. దీంతో అక్కడున్న వారంతా హర్షధ్వానాలతో దిప్కే ప్రకటనను స్వాగతించారు.
జంతర్ మంతర్ ఎపిసోడ్ తర్వాత సీజేపీ నేతల్ని కేంద్రం ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది.

Jantar Mantar Season 2 Coming Soon CJP Founder Abhijeet Dipke Says Amid Instagram Buzz

కాక్రోచ్ జనతా పార్టీని నడపబోతున్న ఆ 12 మంది ఎవరు ? రాజకీయం అంటని జెన్ జీ ప్రతినిధులు..!
కాక్రోచ్ జనతా పార్టీని నడపబోతున్న ఆ 12 మంది ఎవరు ? రాజకీయం అంటని జెన్ జీ ప్రతినిధులు..!

ఇవాళ ఢిల్లీలో సీజేపీ వాలంటీర్ల భేటీ ఏర్పాటు చేసుకుంది. దాని కోసం ఫంక్షన్ హాల్స్ కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఎవరూ తమకు అద్దెకు ఇవ్వడానికి ముందుకు రాలేదని దిప్కే తెలిపారు. పై స్థాయి నుండి ఒత్తిడి ఉందని అందరూ చెప్పారన్నారు. ఎంతో కష్టపడి చివరకు ఓ హాల్ తీసుకుంటే, ఆ హాల్ యజమానుల్ని కూడా బెదిరిస్తున్నారని దిప్కే ఆరోపించారు. ఒకవేళ ఇక్కడ సీజేపీ సమావేశం జరగనిస్తే, వారిని తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారన్నారు ఇదంతా బీజేపీ చేస్తోందని, దేశంలోని యువతను చూసి వారు భయపడుతున్నారనే విషయం వారి మాటలు, చేతల ద్వారా స్పష్టమవుతోందని దిప్కే తెలిపారు. ఇలాంటి నీచమైన చర్యలతో తమను భయపెట్టవచ్చని వారు అనుకుంటే, అది పొరపాటేనని దిప్కే తేల్చిచెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+