Justice Yashwant Varma: నోట్ల కట్టల జడ్జిపై పార్లమెంట్ అభిశంసన..! ముహుర్తం ఫిక్స్..!
గతేడాది మార్చి 14న ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను (Justice Yashwant Varma) ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంలో దోషిగా నిర్ధారిస్తూ పార్లమెంట్ విచారణ కమిటీ ఇవాళ నివేదికను లోక్ సభకు అందించింది. దీంతో ఆయనపై నమోదు చేసిన అభియోగాలు వాస్తవమని తేలిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను హైకోర్టు జడ్డి పదవి నుంచి తొలగించేందుకు అవసరమైన అభిశంసన (Impeachment) ప్రక్రియను పార్లమెంట్ చేపట్టాల్సి ఉంది. దీనికి వచ్చే శీతాకాల సమావేశాలను ముహుర్తంగా నిర్ణయించినట్లు సమాచారం.
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఉన్న మూడు అభియోగాలూ రుజువయ్యాయని పార్లమెంట్ నియమించిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ తేల్చింది. ఆయన అధికారిక నివాసంలో భారీ మొత్తంలో అక్రమ నగదు లభించడం, కీలకమైన సాక్ష్యాలను సరిగ్గా భద్రపరచకపోవడం, ఈ ఘటనపై ఆయన ఇచ్చిన వివరణలు దాటవేత ధోరణిలో, అసంతృప్తికరంగా ఉన్నట్లు పార్లమెంట్ కమిటీ నిర్ధారించింది. వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం తర్వాత స్టోర్ రూమ్ లో లభించిన నగదు ఆధారాల వివరాలను కూడా కమిటీ వెల్లడించింది.

ఆయన ఇంట్లో లభించిన నగదుపై వర్మ సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోవడంతో ఆయనపై అభియోగాలు నిజమని కమిటీ నిర్ధారించింది. న్యాయమూర్తుల చట్టం 1968 ప్రకారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన కమిటీ.. జస్టిస్ వర్మపై ఉన్న మూడు అధికారిక ఆరోపణలను పరిశీలించింది. ఇందులో అధికారిక నివాసంలో వివరాలు లేని నగదు, అగ్నిప్రమాదం తర్వాత స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో రూ.500 నోట్లు లభించడం, కొన్ని చెల్లాచెదురుగా ఉన్న నోట్ల కంటే, కరెన్సీ కట్టలు, కుప్పలు , కట్టలుగా ఉన్నట్లున్న సాక్ష్యాలు, ఆ నగదు ఎక్కడి నుండి వచ్చింది, అది ఎవరిది లేదా అది అక్కడ ఎందుకు ఉంది అనే విషయాలను జస్టిస్ వర్మ చెప్పలేకపోయినట్లు కమిటీ తెలిపింది. అగ్నిప్రమాదం తర్వాత స్టోర్‌రూమ్‌ను వెంటనే సీల్ చేయలేదని, ప్రాథమిక విచారణ బృందాలు వెళ్ళిపోయిన తర్వాత శుభ్ర చేసేశారని కమిటీ గుర్తించింది. చివరికి అధికారిక తనిఖీ నిర్వహించే సమయానికి ఆ నగదు అక్కడ లేదని తేల్చింది.













Click it and Unblock the Notifications