చర్చించండి, నిజాలు తెలుస్తాయి: కిశోర్ చంద్రదేవ్ లేఖ

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్, పార్టీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఏకే ఆంటోనీ, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేలకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్ర విభజన జరిగితే తమకు జరిగే నష్టం, వేధింపులను నిరసిస్తూ ఆంధ్రా ప్రాంతంలోని ప్రజలంతా ఉద్యమిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో లక్ష మందికి పైగా ఏపీఎన్‌జీవోలు సమావేశమై, భారీ సభ నిర్వహించారని వివరించారు.
స్థానిక ప్రజలతో ఎలాంటి ఘర్షణకు కానీ, ఎలాంటి వాగ్వాదానికి కానీ దిగకుండా, ఎలాంటి సమస్యలూ సృష్టించకుండా చాలా పద్ధతిగా సభ నిర్వహించారని తెలిపారు. ఈ సభలో ప్రసంగాలు కూడా ఉద్యోగులను రెచ్చగొట్టేలా కానీ, అవాస్తవాలను ప్రచారం చేసేలా కానీ లేవని, ఉద్యోగులంతా చాలా గౌరవంగా, వేషభాషల్లో చాలా పద్ధతిగా వ్యవహరించారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగమైన ఉద్యోగులు నిర్వహించిన ఆ సభ ఆంధ్ర ప్రాంత ప్రజలంతా వ్యక్తం చేస్తున్న మనోభావాలకు దర్పణం పట్టిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మారిన పరిణామాలను గుర్తించి, ప్రజల్లో భారీగా మద్దతు కలిగిన ఈ వర్గం నాయకులు, ప్రతినిధులతో చర్చలు జరపాలని సూచించారు. క్షేత్రస్థాయి ప్రజల వాస్తవ మనోభావాలను తెలుసుకునేందుకు, శాంతియుతమైన పరిస్థితుల్ని నెలకొల్పేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని వెల్లడించారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications