వారి పేర్లేమిటో చెప్పితేనే...
చనిపోయిన కమల స్వర్గానికి వెళ్ళింది. ద్వారపాలకుడు ఆమెను ఆపి .... "నిన్ను రెండు ప్రశ్నలు అడుగుతాను సరైన జవాబులు చెపితేనే లోనికి అనుమతిస్తాను "అన్నాడు
అడగమంది కమల
"ప్రమాదానికి గురై ప్రాచుర్యం పొందిన ఓడ పేరు "
"టైటానిక్ "
"అందులో ఎంతమంది చనిపోయారు ..? "
"పదిహేను వందలమంది "
"శబాష్ "అని ఆమెను లోనికి పంపాడు ..
కొన్నాళ్ళు గడిచాయి .. ఇప్పుడు ద్వారపాలకుడి స్థానం లో కమల నియమితురాలైంది
ఓ రోజు ఆమె భర్త చనిపోయి పైలోకానికి వెళ్ళాడు.
కమల అతడిని గుర్తుపట్టింది "చూడండి మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాను సరైన సమాధానాలు చెపితేనే లోనికి అనుమతినిస్తాను"
"అడుగు "
"ప్రమాదానికి గురై ప్రాచుర్యం పొందిన ఓడ పేరు "
"టైటానిక్ "
"అందులో ఎంతమంది చనిపోయారు ..? "
"పదిహేను వందలమంది "
"వారి పేర్లు "
అ ... "....... ".!












Click it and Unblock the Notifications