వారెప్పుడూ పెళ్లి కూతురుని....
పెళ్లిళ్ల పేరయ్యని కలిసాడు ఓ పెళ్లి కొడుకు తల్లి తండ్రులు
"కట్నం ఎంతలో ఉన్నారు?" అడిగాడు పేరయ్య
"కనీసం ఇరవై లక్షలు..." చెప్పారు వాళ్లు
"యాభై లక్షల సంబంధం ఒకటి జూబ్లిహిల్స్ లో ఉంది...మీ కులమే.."
"వెరీగుడ్...పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి..." చెప్పాడు పెళ్లి కొడుకు తండ్రి.
"సారి సర్..యాభై లక్షల లేదా ఆపైన కట్నం ఇచ్చేవాళ్లెప్పుడూ ముందర పిల్లను చూపించరు. పెళ్లిలోనే చూడాలి.." చెప్పాడు పేరయ్య
------------
పెళ్లీడు కొచ్చిన కొడుకుని అడిగాడు తండ్రి - "ఏరా..ప్రపచంలో అత్యంత కోటీశ్వరుడు కూతుర్ని చేసుకోవటం నీకు ఇష్టమేనా?"
"ఎవరామె ..బిల్ గేట్స్ కూతురా?"
"అవును.."
"ఉహూ... నాకు ఇష్టంలేదు"
"కానీ చాలా అందంగా ఉంటుంది..వినయంకి వినయం..డబ్బుకు డబ్బు.."
"అయినా వద్దు"
"ఎందుకొద్దు..?"
"వాళ్లు క్రిష్టియన్స్ కదా, నాన్నా!"
"అయితేనేం...అంతా మనష్యులమేగా..." అంటూ కష్టపడి ఒప్పించాడు తండ్రి
"సరే చేసుకుంటాను" అన్నాడు కొడుకు
"గుడ్ ..నిన్ను ఒప్పించాను...ఇక బిల్ గేట్స్ ని కూడా ఒప్పిస్తే చాలు .." తృప్తిగా చెప్పాడు తండ్రి.