భయపడి చస్తారని...
తను ఆఫీసునుంచి వచ్చేసరికి బార్య ల్యాప్ ట్యాప్ ఎదురుగా కూర్చుని ఉంది.. ఏమిటా అని ఆసక్తి చూస్తే ఆమె ఫేస్ బుక్ ఓపెన్ చేసుకుని..తన ఫోటో అప్ లోడ్ చేసే ప్రయత్నంలో ఉంది.
అది గమనించిన భర్త..కంగారుగా.. "ఫేస్ బుక్ లో నీ ఫోటోలు పెట్టకు..." అన్నాడు
దానికి భార్య కంగారుగా ఆపి... "ఎందుకండీ...మార్ఫింగ్ చేస్తారనా...." అంది..
"కాదు జనాలు భయపడి చస్తారని...." మెల్లగా గొణిగాడు భర్త
-------------------
గొప్ప సస్పెన్స్ సినిమా అని టీవీల్లో, ఫేసు బుక్ లో ప్రచారం చేసే సరికి ఉత్సాహంగా సినిమాకు వెళ్ళాడు సుబ్బారావు.... తీరా చూస్తే దాంట్లో ఆ సినిమాలో సస్పెన్స్ ఏమి లేదు...
దాంతో కాలింది... చూస్తే మొదట రోజు ఆ డైరక్టర్ తన టీమ్ తో ఆ సినిమా చూడ్డానికి ఆ థియేటర్ కే వచ్చాడు.
అవేశంగా సుబ్బారావు... వెంటనే డైరెక్టర్ ని పట్టుకుని "సస్పెన్స్ సినిమా అన్నావ్ అసలు సినిమాలో సస్పెన్స్ లేనే లేదు"..
దానికి డైరెక్టర్....... "అదే సస్పెన్స్ .... సినిమా అయ్యేదాకా ఈ విషయమే తెలియలేదు మీకు" అని చెప్పి మెల్లిగా జారుకున్నాడు.