
ఎనిమిదవ రోజు దేవీ నవరాత్రులు - అమ్మవారి ప్రసాదము బెల్లం అన్నం
డా.యం.ఎన్.చార్య
-
ప్రముఖ
అంతర్జాతీయ
జ్యోతిష,
జాతక,
వాస్తు
శాస్త్ర
పండితులు
-
శ్రీమన్నారాయణ
ఉపాసకులు.
సునంద
రాజన్
జ్యోతిష,
జాతక,
వాస్తు
కేంద్రం.
తార్నాక
-హైదరాబాద్
-
ఫోన్:
9440611151
అయిగిరి
నందిని
నందిత
మేదిని....
విశ్వ
వినోదిని
నందనుతే...
గిరివర
వింధ్య
శిరోధిని
వాసిని...
విష్ణు
విలాసిని
జిష్ణునుతే...
భగవతి
హేశితి
కంఠ
కుటుంబిని...
భూరి
కుటుంబిని
భూరికృతే...
జయ
జయ
హే
మహిషాసుర
మర్దిని...
రమ్యకపర్దిని
శైలసుతే...
దేవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు మహిషాసుర మర్ధిని అవతారం ఈ రోజు అమ్మవారికి బెల్లం అన్నం నివేధన చేస్తారు.

బెల్లం అన్నం తయారు చేయుటకు కావలసినవి పదార్ధాలు :-
బియ్యం
100
గ్రాములు
బెల్లం
150
గ్రాములు
యాలకులు
5
నెయ్యి
50
గ్రాములు
జీడిపప్పు
10
బెల్లం అన్నం చేసే విధానం :-
ముందుగా బియ్యం కడిగి అరగంట సేపు నాన బెట్టాలి. ఆ తరువాత మెత్తగా ఉడికించాలి. అందులో తరిగిన బెల్లం వేసి మొత్తం కరిగెంత వరకు ఉడికించాలి. జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి, యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి దించేయడమే. ఈ తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించి కొని అమ్మ కృపకు పాత్రులవుదాము.